OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా

Published : Sep 02, 2026, 09:53 AM IST

OTT Horror Movie: ఓటీటీలో ఓ మలయాళ హారర్ సినిమా దుమ్మురేపుతోంది. ఓ రహస్యమైన రోడ్డు, అక్కడ జరిగే వింత సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కథేంటో, ఎక్కడ చూడొచ్చో చూద్దాం.

PREV
13
ఏంటి ఈ సినిమా కథ?
ఈ సినిమా కథ కేరళలోని తిరువనంతపురం దగ్గరున్న ఓ పల్లెటూరి చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంతంలోని ఓ రోడ్డు మలుపు చాలా ఏళ్లుగా ఓ మిస్టరీగా మారింది. చాలా ఏళ్ల క్రితం ఆ మలుపు దగ్గర గర్భవతి అయిన ఓ మహిళ అనుమానాస్పదంగా చనిపోతుంది. ఆమె చనిపోయాక, ఆ మహిళ ఆత్మ అక్కడే తిరుగుతోందని, ఆ దారిలో వెళ్లేవారికి దెయ్యంలా కనిపిస్తుందని స్థానిక ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా, ఆ రోడ్డులో ప్రయాణించిన కొందరు అదృశ్యమయ్యారనే వార్తలు ఆ ప్రదేశంపై మరింత భయాన్ని పెంచాయి. నిజంగా ఆ మలుపులో దెయ్యం ఉందా? ఆ గర్భిణీకి ఏమైంది? ఆమె చావు వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సినిమా సాగుతుంది.
23
నిజ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా!
తిరువనంతపురం దగ్గర్లోని మైలేమూడు ప్రాంతంలో జరిగాయని చెబుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. అంతేకాదు, ‘సుమతి వలవు’ అనేది సినిమా కోసం పెట్టిన పేరు కాదట. ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఇదే పేరుతో ఓ రోడ్డు మలుపు ఉందని చెబుతున్నారు. విష్ణు శశి శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాళవిక మనోజ్, గోకుల్ సురేష్, బాలు వర్గీస్, సాయిజు కురుప్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.30 కోట్లు వసూలు చేసిందని సమాచారం.
33
ఏ ఓటీటీలో చూడొచ్చు?
థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను చూడొచ్చు. హారర్, మిస్టరీ, నిజ సంఘటనల నేపథ్యం ఉన్న కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఛాయిస్.
Read more Photos on
click me!

Recommended Stories