సుమన్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన నిర్ణయంతో అందగాడి లైఫ్‌ టర్న్

Published : Mar 03, 2025, 07:28 AM ISTUpdated : Mar 04, 2025, 09:06 AM IST

Suman: సుమన్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన నటుడు. ఓ కేసు కారణంగా ఆయన కెరీర్‌ మొత్తం డౌన్‌ అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్‌ స్టార్‌ వల్ల సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు.   

PREV
15
సుమన్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన నిర్ణయంతో అందగాడి లైఫ్‌ టర్న్
Actor suman

Suman Second Innings: సుమన్‌ ఒకప్పటి అందగాడు. ఇప్పటికీ అదే అందం ఆయన సొంతం. కానీ మోస్ట్ అండర్‌రేటెడ్‌ యాక్టర్‌గా మిగిలిపోయాడు. చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీ వంటి టాప్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేసి సక్సెస్‌ అందుకున్న నటుడు. వాళ్ల రేంజ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. దీనికితో అందం ఆయనకు ప్రత్యేక అసెట్‌.

కానీ తన జీవితంలో జరిగిన ఒక మిస్టేక్‌ ఆయన కెరీర్ ని డౌన్‌ చేసింది. సూపర్‌ స్టార్‌ గా రాణించాల్సిన ఆయన్ని ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మార్చేసింది. ఒక అమ్మాయి, తన ఫ్రెండ్‌ విషయంలో సీఎం, డీజీపీ, కాంట్రాక్టర్‌ కలిసి ఆడిన గేమ్‌లో సుమన్‌ బలయ్యాడు. 

25
Suman

ఆ తర్వాత కోలుకుని మళ్లీ సినిమాలు చేశాడు. కానీ అప్పటి క్రేజ్‌ లేదు. హీరోగా సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆయన మార్కెట్‌ తగ్గింది. ఒకానొక దశలో బాగా డౌన్‌ అయ్యారు. ఏం చేయాలనే దైలమా. క్యారెక్టర్స్ కూడా వేస్తూ వస్తున్నారు. కానీ ఏదీ ఆయన రేంజ్‌ పేరుని తీసుకురాలేదు.

ఈ క్రమంలో ఒక్క సినిమా సుమన్‌కి రెండో లైఫ్‌ ఇచ్చింది. ఓ స్టార్‌ హీరో నిర్ణయం సుమన్‌ కెరీర్‌ మళ్లీ పరుగులు పెట్టింది. మరి ఆ హీరో ఎవరు? ఆయన నిర్ణయం ఏంటి?

35
suman, sobhan babu

చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ని లాక్కొస్తున్న సుమన్‌కి `అన్నమయ్య` సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర వేసే అవకాశం ఇచ్చింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ మూవీలో శ్రీవారి పాత్ర కోసం మొదట శోభన్‌ బాబుని అడిగాడు.

ఆయన కోసం చాలా రోజులు తిరిగారు. కానీ శోభన్‌ బాబు అప్పటికే రిటైర్‌మెంట్‌ని ప్రకటించారు. దీంతో ఆయన మళ్లీ నటించేందుకు ఒప్పుకోలేదు. తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. తన రిటైర్‌మెంట్‌ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.
 

45
suman

దీంతో ఆ పాత్రకి ఆల్టర్‌నేట్‌ ఎవరూ అనుకున్నప్పుడు నాగ్‌, రాఘవేంద్రరావు కలిసి సుమన్‌ పేరుని ప్రస్తావించారు. ఆయన్ని సంప్రదించగా, మరో మాట లేకుండా ఓకే చెప్పారు. అంతే శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో జీవించాడు సుమన్.

రియల్‌గా ఆ ఏడుకొండలవాడు ఇలానే ఉంటాడా? అనేంతగా పాత్రకి ప్రాణం పోశారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీలో నాగార్జున పాత్ర తర్వాత సుమన్‌ పాత్రనే బాగా హైలైట్‌ అయ్యింది. అంతే ఆ దెబ్బకి మళ్లీ పుంజుకున్నాడు సుమన్‌. వరుసగా బలమైన పాత్రలు, దేవుళ్ల పాత్రలు ఆయనకు క్యూ కట్టాయి. 
 

55
Suman

ఈ క్రమంలోనే రజనీకాంత్‌ `శివాజీ`లో విలన్‌ రోల్‌ చేసి అదరగొట్టాడు. ఇది కూడా సుమన్‌ కెరీర్‌కి మంచి పుష్‌ ఇచ్చిన చిత్రమని చెప్పొచ్చు. ఇలా శోభన్‌ బాబు వల్ల సుమన్‌కి సినిమాల్లో సెకండ్‌ లైఫ్‌ వచ్చింది. ఆ ప్రభావంతోనే ఇన్నాళ్లు కెరీర్‌ని లాక్కొస్తున్నారు.

ఇంకా సర్వైవ్‌ అవుతున్నారు. ఇటీవల ఆయన చాలా తక్కువగా చేస్తున్నారు. అడపాదడపాగానే సినిమాల్లో కనిపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ స్టార్ ఇమేజ్‌తో రాణించాల్సిన సుమన్‌కి పెద్ద అన్యాయమే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read  more: ట్రైన్‌లోనే ఫస్ట్ నైట్‌ చేసుకున్న ఏకైక హీరో ఎవరో తెలుసా? రాఘవేంద్రరావు మామూలోడు కాదు, ఎంత పనిచేశాడు!

also read: పునీత్‌ రాజ్‌ కుమార్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ అలాంటి వాళ్లా? సీనియర్‌ నటి షాకింగ్‌ కామెంట్స్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories