మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో అంతా షాక్ అయ్యారు. సమంత, పూనమ్ కౌర్ లాంటి హీరోయిన్లని ప్రభుత్వాలు గతంలో బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాయి. అదే విధంగా మీనాక్షికి కూడా అవకాశం దక్కింది అంటూ వార్తలు వచ్చాయి. దీనితో మీనాక్షి సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్ గా మారింది. కానీ ఏపీ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలని ఖండించింది. మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని తేల్చేశారు. మొత్తంగా మీనాక్షికి మాత్రం ఈ ఫేక్ న్యూస్ తో కావాల్సినంత పబ్లిసిటీ లభించింది అని చెప్పొచ్చు.