కొన్ని స్నేహాలు కొంత వరకే ఆగిపోతాయి. ఫ్రెండ్ కోసం రిస్క్ చేయాల్సి వస్తే కొందరు వెనకడుగు వేసేస్తుంటారు. కానీ హీరో సుమన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. బ్లూ ఫిల్మ్స్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డాడు ఓ స్నేహితుడు. ఇంతకీ ఆ హీరో ఎవరు?
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఎన్నో విషయాలలో ఒకరికి మరొకరు అండగా నిలబడ్డారు. అలాగే హీరో సుమన్ కు కూడా ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. కెరీర్ నిలబడుతున్న టైమ్ లో సుమన్ జీవితంలో వచ్చిన ఓ భారీ కుదుపు, తుపానులా అతని లైఫ్ ను నాశనం చేస్తుంటే..అండగా నిలబడ్డాడు. ఇంతకీ ఎవరా స్నేహితుడు.
బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు సపోర్ట్ చేయడానికి ఎవరు ముందు రాకపోయినా.. తనస్నేహితుడితో నిలబడ్డ వ్యక్తి ఎవరో కాదు భాను చందర్. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీ స్నేహితుల్లో సుమన్, భానుచందర్ పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, అనుబంధం గురించి వీరిద్దరూ పలు సందర్భాల్లో మాట్లాడారు.
26
సుమన్ కు అండగా నిలబడ్డ హీరో..
ముఖ్యంగా హీరో సుమన్ జీవితంలో అత్యంత క్లిష్టమైన దశగా చెప్పుకునే గూంఢా యాక్ట్ కేసు సమయంలో భానుచందర్ చూపించిన స్నేహం అందరికి ఆదర్శ అని చెప్పొచ్చు. తమిళ చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుమన్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో భానుచందర్ కీలక పాత్ర పోషించారు.
ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉండటంతో యాక్షన్ సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా సుమన్ చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల్లో స్టార్ హీరోగా ఎదిగారు. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వంటి అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగే టైమ్ కు.. ఓ తుపాను అతని జీవితాన్ని మార్చేసింది.
36
హీరో కెరీర్ ను దెబ్బతీసిన కేసు..
కెరీర్ అత్యున్నత స్థాయిలోకి వెళ్తున్న టైమ్ లో సుమన్‌పై కేసు నమోదు కావడం, అనంతరం జైలుకు వెళ్లడం ఆయన ఫిల్మ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యవహారం తర్వాత ఆయన సినిమా జీవితం గట్టిగా దెబ్బతింది. తరువాత కాలంలో హీరోగా చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆ సినిమాలు చేసి ఉంటే.. ఆయన టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వచ్చేవాడని అంటుంటారు. ఆతరువాత చాలా తక్కువ టైమ్ లోనే క్యారెక్టర్ రోల్స్ వైపు సుమన్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
సుమన్ ను కావాలనే ఇరికించారన్న కారణంగా ఓ హీరోపై పలు ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ కేసుకు సంబంధించి గతంలో మాట్లాడిన సుమన్, తాను తన స్నేహితుడు దివాకర్ కారణంగా ఈ వివాదంలో ఇరుక్కున్నానని.. సినిమా పరిశ్రమకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత కుటుంబ వ్యవహారం అని ఆయన క్లారిటీ ఇచ్చారు. . అయితే మీడియా వర్గాల్లో వచ్చిన కొన్ని కథనాలు తనకు ఇబ్బందులు కలిగించాయని ఆయన గతంలో ఆవేదన వ్యక్తం చేశారు.
56
భానుచందర్ ను కేసులో లాగే ప్రయత్నం..
ఈ వివాదం సమయంలో భానుచందర్ పేరు కూడా లాగేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ.. ముందే ఈ విషయం పసిగట్టిన సుమన్ తన కారణంగా స్నేహితుడు ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో భానుచందర్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. పరిస్థితులు చక్కబడే వరకు ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. కానీ భానుచందర్ మాత్రం సుమన్ విషయంలో బయట నుంచి తన ప్రయత్నాలు తాను చేశాడట. తన స్నేహితుడు చేయని తప్పుకు కేసులో ఇరుక్కొవడంతో.. సుమన్ ను కాపాడేందుకు తన ప్రయత్నం తాను చేశాడు.
66
దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహం..
బ్లూ ఫిల్మ్స్ , రౌడీ యాక్ట్ కేసుల తరువాత చాలామంది సుమన్ కు దూరం అయ్యారు. కానీ భానుచందర్, సుమన్ ల మధ్య స్నేహం మాత్రం ఏమాత్రం దెబ్బతినలేదు. దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తమ స్నేహాన్ని ప్రముఖ రచయితల జంట బాపు-ముళ్లపూడి వెంకటరమణ స్నేహంతో వీరు పోల్చుకుంటుంటారు.
తెలుగులో తనకు అవకాశాలు కల్పించి, హీరోగా నిలబెట్టింది భానుచందరే అని సుమన్ అనేక సందర్భాల్లో కృతజ్ఞతలు తెలిపారు. “నన్ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకువచ్చి పరిచయం చేసి హీరోని చేసింది భానుచందర్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఆయన చేసిన సహాయం ఎంతో ఉంది” అని సుమన్ చెప్పిన మాటలు వారి స్నేహ బంధానికి నిదర్శనం.