Suma Kanakala: యాంకర్ సుమ ఇప్పుడు స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. కానీ ఆమె ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది. మరి ఎందుకు మానేసింది? ఆమె హీరోయిన్‌గా సెట్ కాలేదా? అసలు కారణం ఏంటో తెలుసా?
సుమ కనకాల యాంకర్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. ఫుల్ బిజీగా ఉంటుంది. ఒకప్పుడు బుల్లితెరని శాసించింది. ఈ మధ్యనే చాలా వరకు తగ్గించింది. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్‌లు చేస్తుంది. మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానెల్‌పై ఫోకప్ పెట్టింది. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే యాంకర్ సుమ.. ఒకప్పుడు నటి. ఆమె హీరోయిన్‌గా చేసింది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ గానే ఆమె కెరీర్ ప్రారంభం కావడం విశేషం.
24
రైటర్ సరసన హీరోయిన్ గా సుమ
యాంకర్ సుమ తెలుగులో ఒక సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అదే `కళ్యాణ ప్రాప్తిరస్తు`. దీనికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా సుమ చేసింది. ఇందులో చేసిన వక్కంతం వంశీ, సుమ, కావ్య, మధులకు కూడా ఇదే ఫస్ట్ మూవీ. కానీ బాక్సాఫీసు వద్ద డిజాప్పాయింట్ చేసింది. అదే సమయంలో మలయాళంలోనూ హీరోయిన్‌గా ఆఫర్లు అందుకుంది సుమ. అక్కడ మూడు సినిమాలు చేసింది. అవి బాగానే ఆడాయి. కానీ ఉన్నట్టుండి హీరోయిన్ గా సినిమాలు మానేసింది. క్యారెక్టర్స్ వైపు, బుల్లితెర టర్న్ తీసుకుంది. మరి హీరోయిన్‌గా పేరు రాకపోవడమా? తాను హీరోయిన్‌గా సెట్ కాకపోవడమా? కారణం ఏంటనేది చూస్తే.
34
సుమ హీరోయిన్‌గా సినిమాలు మానేయడానికి కారణం
తాను ఎందుకు సినిమాలు మానేసిందో యాంకర్ సుమ రివీల్ చేసింది. `తెలుగులో దాసరి గారితో `కళ్యాణ ప్రాప్తిరస్తు` చేశాను, ఆ తర్వాత రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను` అని చెప్పింది. అయితే హీరోయిన్‌గా చేయడం వల్ల తాను కంఫర్ట్ గా లేదట. ఏదో అసౌకర్యమైన ఫీలింగ్ కలిగేదట. సినిమా లోకేషన్‌లో గానీ, ఆ డిపార్ట్ మెంట్‌లో గానీ తనకు ఆ ఈజ్ వచ్చేది కాదట. అలాంటి పరిస్థితుల్లో నటించినప్పుడు తన యాక్టింగ్ బిగుసుకుపోతుందని, సరిగ్గా చేయలేకపోతున్నానని, ఫ్రీడమ్ లేదు, ఫీయర్‌గా అనిపించేదని తెలిపింది. తమది ఆర్థడాక్స్ ఫ్యామిలీ కావడంతో ఈ సినిమా కల్చర్‌కి తాను ఇమడలేకపోయానని, దీంతో హీరోయిన్‌గా గుడ్ బై చెప్పినట్టు తెలిపింది.
ఆ తర్వాత వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ వచ్చిందట. ఇలా దాదాపు 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సుమ.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు టర్న్ తీసుకుంది. కొన్ని సీరియల్స్ లో కూడా కనిపించింది. కానీ మెయిన్‌గా యాంకరింగ్ వైపు ఫోకస్ పెట్టింది. స్టార్ మహిళా షోతో ఆమె పాపులర్ అయ్యింది. స్టార్ యాంకర్ గా ఎదిగింది. స్టార్ మహిళా షోని దాదాపు 14ఏళ్లపాటు నిర్వహించడం విశేషం. దీంతోపాటు `అవాక్కయ్యారా`, లేడీ బాస్`, `పట్టుకుంటే పట్టు చీర`, `పంచావతారం`, `కెవ్వు కేక`, `స్వర్ణాభిషేకం`, `సౌందర్య లహరి`, `క్యాష్` వంటి షోస్ చేసింది. ఇప్పుడు `సుమ అడ్డా` పేరుతో షో చేస్తోంది.