సంగీత దర్శకుడు తమన్ మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇటీవల తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను షర్ట్ వేసుకుని తిరగడం లేదని.. స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నట్లు చమత్కరించారు. సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు సంగీత దర్శకుడు తమన్ కావడం విశేషం. డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ కాగా గేమ్ ఛేంజర్ నిరాశ పరిచింది.