ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్

Published : Nov 09, 2025, 04:09 PM IST

సుమ కనకాల తాజాగా తన కెరీర్ లో దక్కిన ఫస్ట్ బ్రేక్ గురించి మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎదురైన చేదు అనుభవాలని కూడా రివీల్ చేశారు. కొన్నిసార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తాను కిటికీ లో నుంచి దూకి పారిపోవాల్సి వచ్చింది అని తెలిపారు. 

PREV
15
యాంకర్ గా సుమ కనకాల క్రేజ్ 

టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా సుమ కనకాల కొనసాగుతున్నారు. టాలీవుడ్ జరిగే దాదాపు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకర్ గా ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫ్యాన్స్ ని హుషారెత్తించేలా హీరోలకు ఎలివేషన్స్ ఇస్తూ, మధ్యలో జోకులు వేస్తూ, సందర్భానుసారం మాట్లాడుతూ సరదాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సుమ నడిపిస్తుంది. ఆమెకి ఉన్న క్రేజ్ చూసి నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం ఆమెకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. 

25
సుమ కనకాలకి వచ్చిన ఫస్ట్ బ్రేక్ 

సుమ భర్త రాజీవ్ కనకాల దశాబ్దాలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. సుమ కొడుకు రోషన్ కూడా ఇటీవల హీరోగా లాంచ్ అయ్యాడు. సుమ కనకాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనకి ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. సుమ మాట్లాడుతూ.. ''నేను కెరీర్ ప్రారంభించింది 1991లో. నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది 2006లో. ఎక్కడ 1991... ఎక్కడ 2006. కొంతమంది జూనియర్లు రెండు నెలలు, మూడు నెలలు, లేదా ఏడాది ట్రై చేసి మాకు అవకాశాలు రావడం లేదు అంటూ వెనక్కి వెళ్లిపోతుంటారు. 

35
ఆంధ్రావాలా ఆడియో లాంచ్ 

ఎవ్వరైనా సహనంతో ఉంటేనే సక్సెస్ వస్తుంది. 2006లో ఓ ఛానల్ లో అవాక్కయ్యారా ? అనే షో చేశాను. అదే నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్. ఫోన్ కాల్, ఎస్ ఎమ్ ఎస్ ద్వారా జరిగే షో అది. దీనితో కొన్ని వేలమంది ఆ షోకి కాల్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దెబ్బకి ఛానల్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడే రియలైజ్ అయ్యా.. ఇదే నా ఫస్ట్ సక్సెస్ అని'' అంటూ సుమన్ తెలిపింది. ఆంధ్రావాలా ఆడియో లాంచ్ నాకొక చేదు అనుభవం. ఆ ఈవెంట్ కి కొన్ని లక్షల మంది హాజరయ్యారు. నాలుగు ట్రైన్లు వేశారు. ఓ ట్రైన్ కి నేను ఇంచార్జ్. ట్రైన్ దిగి ఈవెంట్ కి వెళ్లడం సాధ్యం కాలేదు. 

45
కిటికీ దూకి పారిపోయిన సుమ కనకాల  దీనితో మధ్యలోనే దిగేసి విజయవాడ నుంచి కారు బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయినట్లు సుమ

న్ పేర్కొంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చాలా జాగ్రత్తగా ఉంటాను. అభిమానుల తొక్కిసలాట పెరిగిన తర్వాత.. ముందుగా నా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికని గమనిస్తారు. ఎమెర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది ? దూకి పారిపోవడానికి కిటికీలు ఎక్కుడ ఉన్నాయి ? అని అన్నీ గమనిస్తారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిపోగానే అభిమానులు ఓ ప్రవాహంలా వేదికపైకి దూసుకు వస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారి సినిమాల ఈవెంట్స్ లో రెండుసార్లు కిటికీ దూకి పారిపోయాను. 

55
చిరంజీవి ఖైదీ నెంబర్ 150

ఈవెంట్  మెగాస్టార్ చిరంజీవి గారి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని యాంకరింగ్ చేసినట్లు సుమ తెలిపారు. ఆ ఈవెంట్ కి వచ్చిన జనాల వాళ్ళ వేదిక ఊగిపోయింది. స్టేజీ ఎక్కడ కూలిపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఒక దశలో నేను వేదిక దిగిపోతాను అని చెప్పినట్లు సుమ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories