Devi Nagavalli: ఆమెతో గొడవెట్టుకో హిట్టు పట్టుకో.. అప్ కమింగ్ హీరోల పాలిట వరంలా మారిన దేవీ నాగవల్లి 

Published : May 06, 2022, 03:35 PM ISTUpdated : May 06, 2022, 03:37 PM IST

టాలీవుడ్ లో ఓ విచిత్రమైన సెంటిమెంట్ బయలుదేరింది. అప్ కమింగ్ హీరోల పాలిట ఆమె వరమన్నా ప్రచారం తెరపైకి వచ్చింది. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లితో గొడవ పెట్టుకుంటే ఆ హీరోకి విజయమేనట. ఏకంగా స్టార్స్ ఐపోతారట. ఆ కహానీ ఏమిటో చూద్దాం..

PREV
16
Devi Nagavalli: ఆమెతో గొడవెట్టుకో హిట్టు పట్టుకో.. అప్ కమింగ్ హీరోల పాలిట వరంలా మారిన దేవీ నాగవల్లి 


దేవి నాగవల్లి(Devi Nagavalli).... గత మూడు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న దేవి నాగవల్లి గొప్ప ఫెమినిస్ట్.ఆమె స్త్రీలకు ఏ రూపంలో అన్యాయం, అవమానం జరిగినా సహించరు. తన టీవీ ఛానల్ ద్వారా ఖండిస్తారు. సదరు సంఘటనలపై డిబేట్స్ పెడతారు. 

26

తాజాగా ఆమె హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) తో గొడవపడ్డారు. విశ్వక్ తన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. ప్రమోషన్ కోసం పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తారా.. అంటూ దివి హీరో విశ్వక్ ని స్టూడియోకి పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విశ్వక్ స్టూడియో నుండి బయటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో విశ్వక్ తనను బూతులు తిట్టాడని దేవి ఆరోపణలు చేశారు.

36


ఈ గొడవ గురుంచి అందరికీ తెలిసిందే. తన ప్రశ్నలతో హీరోలను ఇరిటేట్ చేస్తున్న దేవి నాగవల్లి ఆమె తెలియకుండానే వాళ్లకు మేలు చేస్తున్నారట. దేవితో గొడవపడ్డ యంగ్ హీరోలకు హిట్ దక్కడం ఓ సెంటిమెంట్ అంటూ కొత్త వాదన బయలుదేరింది. దీనికి రుజువుగా విజయ్ దేవరకొండ, సిద్ధు ఉదంతాలను చూపిస్తున్నారు. 

46


అర్జున్ రెడ్డి మూవీ అనేక వివాదాలకు కారణమైంది. ఆ మూవీలో హీరో హీరోయిన్ ని ట్రీట్ చేసిన విధానం పురుషాధిక్యతకు పరాకాష్ట, నిజమైన ప్రేమికుడు తన లవర్ ని కొడతాడా? అలాగే నిస్సుగ్గుగా ఆ ముద్దులేంటి అంటూ పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టారు. ఈ డిబేట్స్ కి ప్రధానంగా దేవి నాగవల్లి ప్రాతినిధ్యం వహించారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-దేవి మధ్య కూడా డిబేట్ నడిచింది. ఫైనల్ గా అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ నమోదు చేసింది. 

56

అలాగే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ డీజే టిల్లు విషయంలో కూడా వివాదం నడిచింది. ఆ సినిమా ట్రైలర్ ఆధారంగా హీరో సిద్ధుని స్టూడియోకి పిలిచి దేవి నాగవల్లి ఇంటర్వ్యూ చేశారు. నిజ జీవితంలో మీరు ఉమనైజరా? అంటూ దేవి నాగవల్లి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సిద్దు అసహనానికి గురయ్యారు. అసలు ఉమనైజర్ కి అర్థం ఏమిటో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. కట్ చేస్తే డీజే టిల్లు డబుల్ బ్లాక్ బస్టర్. నిర్మాతలకు ఈ మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

66

విశ్వక్ సేన్ సైతం ఈసారి పక్కాగా హిట్ కొట్టినట్లే అంటున్నారు జనాలు. దేవి నాగవల్లి సెంటిమెంట్ నేపథ్యంలో అశోకవనంలో అర్జున కళ్యాణం భారీ సక్సెస్ అవుతుందంటున్నారు. వాస్తవంలో చూసినా ఈ సెంటిమెంట్ కరెక్టే అనిపిస్తుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఈ స్థాయి విజయం సాధిస్తుందో వసూళ్ల ఆధారంగా తెలుస్తుంది. 

click me!

Recommended Stories