Ennenno Janmala Bandham: తిరిగి కోలుకున్న సులోచన.. సులోచనకి యాక్సిడెంట్ చేసిన కార్ ని గుర్తించిన వేద!

Published : Oct 17, 2022, 01:07 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
16
Ennenno Janmala Bandham: తిరిగి కోలుకున్న సులోచన.. సులోచనకి యాక్సిడెంట్ చేసిన కార్ ని గుర్తించిన వేద!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. యష్ వేదతో, అక్కడ జరిగిందొకటి నువ్వు విన్నది ఒకటి అని అంటాడు. దానికి వేద, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. నేను తల్లి కాలేను ఇది ఓపెన్ సీక్రెట్ నేను ఎవరి దగ్గర దాయలేదు కానీ అందరూ నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నేను మాత్రం ఎక్కువసార్లు నా జీవితంలో బాధపడింది గొడ్రాలు అన్నమాటకే. అయినా ఆ అవమానం కూడా నాకు అలవాటైపోయింది.నేను మీకు ఆదికి మధ్య ఎప్పటికీ గోడని కాను అని అంటుంది వేద. దానికి యష్,నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నువ్వు నాకు ఆదికి మధ్యలో వస్తావు అని ఎందుకు అనుకుంటాను. అయినా నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నా మనసులో నీ స్థానం వేరు ఆది స్థానం వేరు. రెండు ఒకటి కాదు ఇంక మాళవిక విషయానికొస్తే తను కేవలం ఆది వాళ్ల అమ్మ మాత్రమే అని యష్ అంటాడు. దానికి వేద, నేను కూడా ఖుషి వాళ్ళ అమ్మని మాత్రమే కదా అలాగే మీ జీవితంలోకి వచ్చాను కదా అయినా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అంటుంది వేద.దానికి యష్ అడుగుమని చెప్పగా, మీరు ఇంకా మాలవికని లవ్ చేస్తున్నారు కదా అని అడుగుతుంది వేద. ఆ తర్వాత సీన్లో వేదా, యష్ ఇద్దరు రోడ్డు బయట టిఫిన్ చేస్తూ ఉండగా,యష్ పొలమారితే వేద వచ్చి మంచినీళ్లు ఇస్తుంది.

26

అప్పుడు వేద కంగారుని చూసిన యష్, ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగావు కదా నాకు మాలవిక అంటే ఇంకా ప్రేమ ఉన్నదా లేదా అని ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను నీకు నేను ఇష్టం కదా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం సేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఆ  తర్వాత సీన్లో, సులోచనకు నయం కావాలి అని వాళ్ళ భర్త దేవుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తారు. అదే సమయంలో సులోచన కుర్చీలో కూర్చుని దాన్ని చూస్తూ ధూపం వెలిగించమని సైగ చేస్తుంది. ఇంతలో మాలిని అక్కడికి వచ్చి ధూపం వెలిగించి ఇల్లంతా పొగని చేరుస్తుంది. అందరి మోకాళ్ళ మీదకు వెళ్లి ఆ పొగని చేరుస్తుంది అలాగే సులోచన ముఖం మీద కూడా పొగని చేరుస్తూ ఉండగా సులోచన తట్టుకోలేక నీకు అసలు బుద్ధుందా? ఇది ధూపం అనుకుంటున్నావా లేకపోతే మునిసిమాలిటీ దోమల మందు అనుకుంటున్నావా అని అంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆనందపడతారు అప్పుడు మాలిని ఆనందపడి నువ్వు ఇంకా తిట్టు అని అంటుంది. అసలు నీకు బుద్ధుందా? అయినా మొన్న నువ్వు ఏమన్నావు వేయినూట పదహారు బూతులు ఎలా తిట్టాలని గూగుల్ కెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నావు కదా నాకు గూగుల్ అవసరం లేదు నోటితోనే లక్ష బూతులు తిడతాను అని అంటుంది.
 

36

దానికి మాలిని నువ్వు మాట్లాడుతున్నావ్ సులోచన అని అనగా అవును నేను మాట్లాడుతున్నాను అని ఆనందపడుతుంది. ఈ మాటలు విన్న వేద వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నువ్వు మాట్లాడుతున్నావు అని ఆనందపడుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడతారు. అప్పుడు యష్ వచ్చి అత్తయ్య మీకు బాగుందా బానే ఉన్నారా అని అంటారు.అవును బాబు బానే ఉన్నాను. మీరు అందరూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అని సులోచన అంటుంది.అప్పుడు యష్ ఇన్ని రోజులు మీరు మాకు కా!తో ఏదో చెప్పాలనుకున్నారు కదా అది ఏంటి అని అనగా వేద కూడా, అవును చెప్పమ్మా అది ఒక పేరు కదా అని అంటుంది. పక్కనే ఉన్న మాలిని కా అంటే కాసులపేరు అని అనగా కాదు అది ఏదో మనిషి పేరులా ఉన్నది చెప్పమని వేదా అంటుంది. క అంటే కారు నల్ల కారు దూకుడుగా వచ్చి నన్ను గుద్ధి వెళ్ళింది కావాలనే నా మీద కారు వచ్చింది నేనేం తప్పు చేయలేదు అని సులోచన అంటుంది. దానికి వేద, నాకు తెలుసమ్మా అది ఎవరో కావాలనే చేశారు అని అనగా అతనిని ఎలాగైనా పట్టుకుంటాను అది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను మీకు మాటిస్తున్నాను అని యష్ సులోచన తో అంటాడు.

46

 ఆ తర్వాత సీన్లో యష్ గదిలో కూర్చుని ఉండగా ఖుషి వచ్చి నాన్న నువ్వు ఆఫీస్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. నువ్వెందుకు స్కూల్ కి వెళ్ళలేదు అని అడగగా ఈరోజు ఆదివారం కదా నాన్న అని ఖుషి అంటుంది. ఈరోజు ఆదివారం కదా అందుకే నాకు కూడా సెలవు అని యష్ అంటాడు. దానికి ఖుషి, అయితే మనం సాయంత్రం బయటికి వెళ్దామా అని అనగా సరే బయటికి వెళ్లి ఐస్క్రీం కొనిస్తాను అని యష్ అంటాడు. తర్వాత ఖుషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.అప్పుడు వేద అక్కడికి వచ్చి నాకు క్లినిక్ లో ఒక అర్జెంటు పని ఉంది. నా కార్ సర్వీసింగ్ కి ఇచ్చాను మీ కార్ ఇవ్వండి అని అనగా, ఈ కారు నాకు సెంటిమెంటు అసలుకే నీకు డ్రైవింగ్ రాదు చచ్చిన ఇవ్వను అని అంటాడు. దానికి వేద నాకు ఎలా తీసుకోవాలో తెలుసు అయినా కార్ మీదేంటి నాది కూడా కదా, నేను మీ భార్యనే కదా నేను ఆ కార్ మీద వెళ్తాను నఅని అనగా, ఆ కార్ తాళాలు నా జేబులో ఉన్నాయి తీసుకోవడం నీ వల్ల కాదు అని అంటాడు. అప్పుడు వేద ఖుషి ని తీసుకొచ్చి చూడు ఖుషి నేను బైటకి వెళ్తాను అంటే మీ నాన్న నాకు కారు ఇవ్వట్లేదు అని అనగా ఖుషి యష్ వైపు కోపంగా చూసి నాన్న కార్ ఇవ్వండి అని అంటుంది.
 

56

అప్పుడు యష్, అలా కాదమ్మా నాకు ఇప్పుడు అర్జెంట్ పని వస్తే వెళ్ళాలి కదా మీ అమ్మని క్యాబ్లో వెళ్ళమను అని అంటాడు.దానికి ఖుషి, మా అమ్మకి కార్ ఇచ్చి, ఏవైనా అవసరం వస్తే నువ్వే క్యాబ్లో వెళ్ళు. మా అమ్మ కు డ్రైవింగ్ బాగా వచ్చు అని బలవంతంగా యష్  దగ్గర నుంచి తాళాలు తీసి వేద కి ఇప్పిస్తుంది ఖుషి. ఆ తర్వాత యష్ కోపంతో వేదవైపు చూస్తాడు. వేద తాళాలు తీసుకొని కారులో కూర్చొని నాకే డ్రైవింగ్ రాదు అంటారా, నేను వేదశ్విని ని మంచి డాక్టర్ని, మంచి డ్రైవర్ని కూడా ఒక్క చిన్న గీత కూడా పడకుండా తిరిగి అప్పజెప్పిస్తాను అని కూర్చుంటుంది. కారులో కూర్చుని వెనక్కి తిప్పేలోగే ఒక కారుకు ఢీ కొట్టేస్తుంది. 
 

66

వెనక్కి వచ్చి చూసేసరికి కారు మీద గీతలు పడతాయి. అయ్యయ్యో అప్పుడే గీత పడిపోయింది ఇప్పుడు ఈ విషయం మిస్టర్ అరోగెంట్ కి తెలిస్తే, అందుకే నీకు కారు ఇవ్వను అన్నాను అని చెప్పి నా మీద పడతాడు. వెంటనే సర్వీసింగ్ సెంటర్ కి వెళ్లి దీన్ని మార్పించి ఏమీ తెలియనట్టు ఇక్కడ పెట్టేద్దామనుకొని అక్కడికి వెళుతుంది. రిపేరింగ్ సెంటర్ కి వెళ్లిన వేద, ఇవి ఖచ్చితంగా పోతాయి కదా ఏ గుర్తులు ఉండవు కదా అని అడగగా, కొత్తగా కొన్న కార్ లా ఉంటది మేడం. మీకు అంత నమ్మకం లేకపోతే మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ అయిన కారు ఉన్నది నీటిగా చేశాను అని ఆక్సిడెంట్ అయిన కార్ ని చూపిస్తాడు అతను. అప్పుడు వేద ఆ కార్ ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories