ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పుష్ప 2 చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెడితేనే డిసెంబర్ 6 రిలీజ్ వీలవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సుకుమార్, అల్లు అర్జున్, ఇతర పుష్ప 2 చిత్ర యూనిట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు.