డిస్ట్రిబ్యూటర్ గా తనకి ఎదురైన కష్టాల గురించి చెబుతూ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం డబ్బింగ్ చిత్రాలు తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారట. ఆ చిత్రాలు దారుణమైన రిజల్ట్ ఇచ్చాయి. దీనితో దిల్ రాజుకి నష్టాలు తప్పలేదు. వరుసగా నష్టాలు ఎదురవుతుండడంతో ఆఫీస్ మూసేసి సినిమా ఇండస్ట్రీ వద్దనుకుని వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యారట.