బాలకృష్ణ రాముడు కాదా? వెంకటేష్‌ నిర్మొహమాటంగా చెప్పేశాడు, నాలుగు స్థంభాల ప్రస్తావన

First Published | Dec 24, 2024, 1:08 PM IST

బాలకృష్ణ, వెంకటేష్‌ కలిశారు. ఈ అరుదైన కలయిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలకృష్ణపై వెంకటేష్‌ వేసిన సెటైర్లు ఆసక్తికరంగా మారాయి. 
 

బాలకృష్ణ సినిమా హీరోగా ఒకరకమైన అభిప్రాయం ఉంది. ఆయనపై చాలా వరకు నెగటివ్‌ ప్రచారమే జరుగుతుంటుంది. కానీ దాన్ని పూర్తిగా బ్రేక్‌ చేసిన షో `అన్‌ స్టాపబుల్‌`. బాలయ్యలోని కొత్త యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసిన షో. బాలయ్య ఇలా ఉంటాడా? అని ఆశ్చర్యపోయేలా చేసిన షో. తాజాగా నాల్గవ సీజన్‌ నడుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్‌, సూర్య, దుల్కర్‌ సల్మాన్‌, నవీన్‌ పొలిశెట్టి, శ్రీలీల వంటి వారు పాల్గొన్నారు. 

ఇప్పుడు ఇండస్ట్రీలో నాలుగు స్థంభాల్లో ఒకరిగా రాణిస్తున్న వెంకటేష్‌ షోకి వచ్చారు. వెంకీ ఇలాంటి టాక్‌ షోలకు రావడం చాలా అరుదు.  కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ షోస్‌, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇలాంటి టాక్‌ షోకి మాత్రం చాలా అరుదు. ఇప్పుడు బాలకృష్ణ కోసం వచ్చాడు. అంతేకాదు తాను హీరోగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో బాలయ్య, వెంకీ మధ్య ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. 
 


బాలయ్యని డాకు అంటే, నువ్వే నాకు మహారాజువి అని వెంకీని అన్నారు. వెంకీ తొడకొడితే, బాలయ్య సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌ అంటూ మాస్‌ చూపించాడు బాలయ్య. కారాలు మిర్యాలు నూరుకున్నారు. ఒకరి ముందు మరొకరు కాలు మీద కాలేసుకున్నారు. బాలయ్య బాబు అంటే అది అని, వెంకీ బాబు అంటే ఇది అని చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి ఒకే సోఫాలో కూర్చొని ఇండస్ట్రీకి అదిరిపోయే పోస్టర్‌ని ఇచ్చారు. ఇద్దరి మధ్య కన్వర్జేషన్‌ ఆద్యంతం ఫన్నీగా సాగింది. అదే సమయంలో గతం తాలుకూ విషయాలు డిస్కస్‌ చేస్తూ సీరియస్‌గా మార్చారు. మరోవైపు తండ్రి గురించి వెంకటేష్‌, సురేష్‌ బాబు చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. 

ఈ క్రమంలో నాలుగు స్థంభాల ప్రస్తావన వచ్చింది. ఒకప్పుడు ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను నాలుగు స్థంభాలుగా పిలుస్తుంటారు. మళ్లీ వెంకీని ఇలా చూస్తుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయన్నారు బాలయ్య. అప్పట్లో భలే ఉండేదని, చెన్నైలో చేసిన కొంటెపనులు గురించి చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన సైగలు మసాలా అంశాలు బాగానే ఉన్నాయనే హింట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా నాలుగు స్థంభాల్లో రాముడు ఎవరు అనే ప్రస్తావన వచ్చింది. బాలకృష్ణ మెలికలు తిరిగాడు. దీంతో వెంటనే వెంకటేష్‌ రియాక్ట్ అయ్యాడు. ఏంటీ నువ్వు అనుకుంటున్నావా? అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దీనికి ఏమయ్య భయపెట్టిస్తే  అని బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది. 
 

ఈ సందర్భంగా నాగచైతన్య గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు వెంకీ. చాలా మంది పిల్లల్ని హగ్‌ చేస్తాం. కానీ వీడిని హగ్‌ చేస్తే ఒక తెలియని ఆనందం వేస్తుందని, తనకు ఇంతే ఉంటాడనేలా ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌ అదిరిపోయింది. ఈ సందర్భంగా వెంకీ అన్న సురేష్‌ బాబు, కూడా వచ్చారు. వెంకీ రైల్వే ట్రాక్‌ లపై చేసిన హంగామా గురించి వెల్లడించారు. అలాగే `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ దర్శకుడు అనిల్‌ రావిపూడి సైతం సందడి చేశాడు. 

read more: శ్యామ్‌ బెనెగల్‌ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసా? తెలంగాణ జీవితానికి జాతీయ గుర్తింపు

Latest Videos

click me!