Heroine Meena: మీనాకు తలబిరుసు ఎక్కువ, దారుణంగా ట్రోల్స్.. తన తప్పేంటో ఓపెన్‌గా చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

Published : Mar 31, 2026, 07:53 AM IST

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన నటి మీనా అప్పట్లో ఒక దారుణమైన ట్రోలింగ్‌కి గురయ్యింది. `మీనాకి తలబిరుసుతనం` అంటూ ఇండస్ట్రీ మాట్లాడుకుందట. దానికి కారణమేంటో వెల్లడించింది మీనా. 

PREV
15
ట్రెడిషనల్‌ లుక్‌లో కట్టిపడేసిన హీరోయిన్‌ మీనా

హీరోయిన్‌ మీనాని చూస్తే మన ఇంట్లో అమ్మాయినే గుర్తొస్తుంది. అలాంటి అమ్మ కావాలని, అలాంటి చెల్లి కావాలని, అలాంటి భార్య కావాలని, ఇలాంటి వదిన కావాలని, ఇలాంటి కోడలు కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంత బాగా, అంతటి అందంగా, అంతటి వినయంగా ఉంటారు. నిండైన రూపం, క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంది. గ్లామర్‌ కి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండా ట్రెడిషన్‌ లుక్‌లో కనిపిస్తూ మెప్పించింది. ఇతర హీరోయిన్లు అందాల ఆరబోతలో పోటీ పడుతున్నా, తాను ఎప్పుడు బార్డర్‌ దాటలేదు, అదే ఆమెని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది.

25
ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన నటి మీనా

మీనా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఎక్స్ పోజ్‌ చేయకపోయినా, మంచి సినిమాలు, మంచి మంచి రోల్స్ చేసి మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. చాలా వరకు ఫ్యామిలీ కథలతో కూడిన సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలు, తనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. ఇటీవల ఆమె ఎక్కువగా `దృశ్యం` చిత్రాలతోనే మెరుస్తోంది. ప్రస్తుతం మలయాళంలో `దృశ్యం 3`లో నటిస్తోంది. ఇది త్వరలో విడుదల కానుంది.

35
మీనాకి తలబిరుసుతనం

ఈ క్రమంలో నటి మీనాకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె హీరోయిన్‌గా కెరీర్‌ పరంగా పీక్‌లో ఉన్న సమయంలో ఆమెపై ఒక నెగటివ్‌ కామెంట్‌ వినిపించింది. ఇండస్ట్రీలో అంతా కలిసి ఒక ట్యాగ్‌ కూడా పెట్టారు. `మీనాకి తలబిరుసు ఎక్కువ` అని చాలా మంది అనుకునేవారట. ఇండస్ట్రీలో తనపై చాలా ట్రోలింగ్‌ జరిగిందట. దీనిపై నటి మీనా వివరణ ఇచ్చింది. తాను చేసిన తప్పేంటో, ఎందుకు అలాంటి ట్యాగ్‌ వచ్చిందనేది ఆమె వెల్లడించింది. మీనా చిన్నప్పట్నుంచి మద్రాస్‌లో పెరిగింది. తెలుగు సరిగ్గా రాదు. దీంతో ఒకటి మాట్లాడబోయి మరోటి మాట్లాడితే, ఎవరైనా బాధపడతారేమో అనుకుని ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదట . అప్పట్లో భయం, అమాయకత్వం, తెలియనితనం, అభద్రతాభావం ఉండేవని, కలుపుగోలుగా ఉంటే ఎవరైనా అడ్వాంటేజ్‌ తీసుకుంటారేమో అని భయపడి పెద్దగా మాట్లాడేది కాదట. అందుకే చాలా మంది తనని `మీనాకు తలబిరుసుతనం` అనుకునేవాళ్లట. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయడం వల్ల కొంచెం ధైర్యం వచ్చిందని, అప్పట్నుంచి కొంచెం మాట్లాడటం మొదలు పెట్టినట్టు తెలిపింది మీనా.

45
ట్రోల్స్, విమర్శలను లైట్‌ తీసుకున్న మీనా

అయితే `మీనాకు తలబిరుసుతనం` అనే కామెంట్లు విన్నప్పుడు తన ఫీలింగ్‌ని వెల్లడించింది మీనా. మొదట్లో తనకు పెద్దగా తెలియలేదట. మన గురించి ఎందుకు అలా అనుకుంటున్నారని ఆలోచించేదట. కొన్ని రోజుల తర్వాత లైట్‌ తీసుకుందట. మనమేంటో మనకు, మన కుటుంబానికి తెలుసు, బయటవాళ్లకి తెలియకపోతే ఏంటనే భావించేదట. కానీ తనతో ఫ్రెండ్స్ అయిన తర్వాత కొందరు మీరు ఎంత స్వీట్‌ పర్సన్‌, చాలా బాగా మాట్లాడుతున్నారే, కానీ మీ గురించి వేరేలా అనుకున్నాం అని చెప్పేవాళ్లు. పోనీలే ఇప్పుడైనా తెలుసుకున్నారు కదా అని సంతోషించేదట. మొత్తంగా తనకు తెలుగు సరిగా రాకపోవడం, భయం, అడ్వాంటేజ్‌ తీసుకుంటారనే అభద్రతాభావం వంటి వాటి కారణంగా ఆమె ఎవరితోనూ మాట్లాడకపోవడం, అది కాస్తా `మీనాకు తలబిరుసుతనం` అనే ట్యాగ్‌ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

55
మీనా తెలుగులో చేసిన సినిమాలివే

ఇక మీనా.. బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది. చాలా మంది బిగ్‌ స్టార్స్ తో సినిమాలు చేసింది. `నవయుగం` అనే చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `సీతారామయ్య గారి మనవరాలు` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకి మనవరాలుగా నటించింది. `చంటి`, `అల్లరి మొగుడు`, `సుందరకాండ`, `ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం`, `అశ్వమేథం`, `అబ్బాయిగారు`, `అల్లరి అల్లుడు`, `బొబ్బిలి సింహం`, `చిలకపచ్చ కాపురం`, `ముద్దుల మొగుడు`, `సూర్యవంశం`, `స్నేహం కోసం`, `మా అన్నయ్య`, `రైల్వే కూలీ`, `భరతసింహారెడ్డి`, `స్వామి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరగా ఆమె తెలుగులో `దృశ్యం 2`లో నటించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories