పుష్పలో ఫహద్ ఫాజిల్ లాగా చేస్తాం అంటే ఒప్పుకోలేదు..దటీజ్ సుకుమార్ డాటర్, అందుకే జాతీయ అవార్డు

Published : Aug 01, 2025, 08:45 PM IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది. ఆమె నటించిన గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఈ అవార్డు సొంతం చేసుకుంది.

PREV
15
జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన సుకుమార్ కూతురు

భారత ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 1) రోజు71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నాయి. ఈ క్రమంలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డికి అవార్డు లభించింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, గోపీ టాకీస్ బ్యానర్ల మీద తబిత సుకుమార్ సమర్పణలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది.

25
ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి

అందరి హృదయాల్ని తాకేలా, మనసుల్ని హత్తుకునేలా ‘గాంధీ తాత చెట్టు’ కథ ఉంటుంది. తాత కోసం మనవరాలు ఏం చేసింది? ఓ చెట్టుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది? చెట్టు ప్రాముఖ్యత ఏంటి? అంటూ సాగిన కథ, కథనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో సుకృతి వేణి బండ్రెడ్డి నటనకు అందరూ ముగ్దులయ్యారు. మొదటి చిత్రంలోనే అంత గొప్పగా నటించిన సుకృతి వేణి బండ్రెడ్డికి ఇప్పుడు తగిన పురస్కారం లభించింది.

35
తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు

మొదటి చిత్రంతోనే ఇలా జాతీయ అవార్డును సాధించడం అంటే మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయగా సుకృతి వేణి నిలిచారు. జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డు గెలిచిన సుకృతి వేణి బండ్రెడ్డిపై తెలుగు చిత్ర సీమ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతోంది.

45
పుష్పలో ఫహద్ ఫాజిల్ లాగా చూపిస్తాం అని చెప్పిన సుకుమార్

గాంధీ తాత చెట్టు చిత్రం కోసం సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రదర్శించిన డెడికేషన్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం కోసం సుకృతి గుండు చేయించుకోవాల్సి వచ్చిందట. ముందుగా చెబితే తన కూతురు ఒప్పుకోదేమో అని సుకుమార్ అనుకున్నారు. అందుకే పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ లాగా గుండు చేయించుకున్నట్లు ఆర్టిఫీషియల్ మేకప్ తో చూపిస్తాం అని చెప్పారట.

55
దటీజ్ సుకుమార్ డాటర్, ఆమె ఇచ్చిన సమాధానం ఇదే

కానీ సుకుమార్ కుమార్తె సుకృతి చెప్పిన మాటకి అంతా షాక్ అయ్యారు. మేకప్ అవసరం లేదు నిజంగానే గుండు చేయించుకుంటాను. జుట్టే కదా మళ్ళీ పెరుగుతుంది లే అని చెప్పిందట. చెప్పినట్లుగానే ఆ పాత్ర కోసం సుకృతి నిజంగా గుండు చేయించుకుంది. తన కూతురు గుండు చేయించుకోవడం చూసి సుకుమార్ సతీమణి తబిత భావోద్వేగానికి గురయ్యారట. ఆ చిత్రం కోసం అంత డెడికేషన్ ప్రదర్శించింది కాబట్టే సుకృతికి ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు దక్కింది.

Read more Photos on
click me!

Recommended Stories