కాపీ వివాదంలో ‘పుష్ప’, రైటర్ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్
First Published | Aug 26, 2020, 3:14 PM ISTభారీ సినిమాలకు క్రేజ్ తో పాటు ,కాపీ వివాదాలు ప్రక్కనే ఉంటున్నాయి. కొన్నైతే రిలీజ్ తర్వాత కాపీ వివాదాలు మొదలైతే, మరికొన్ని ప్రారంభం నుంచి వివాదాలును ఎదుర్కొంటున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక చిత్రం `పుష్స` విషయంలో ఈ కాపీ వివాదం మరికాస్త ముందుగానే మొదలైంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పుష్ఫ’ కథ నాదే.. అంటూ ఓ రచయిత ఇప్పుడు గళం విప్పి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా రచయిత..ఏమిటా వివాదం చూద్దాం...