అక్షయ్‌కి దూరంగా ఉండు.. సీనియర్‌ నటికి, యంగ్‌ బ్యూటీ వార్నింగ్

First Published | Aug 26, 2020, 2:46 PM IST

అక్షయ్‌ కుమార్ కెరీర్‌ స్టార్టింగ్‌లో సీనియర్ నటి రేఖతో పలు చిత్రాల్లో నటించాడు. అయితే అదే సమయంలో రవీనా టండన్‌తోనూ అక్కి రిలేషన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. రేఖ రిలేషన్ రవీనాను ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె అక్షయ్‌కు దూరంగా ఉండాలని రేఖకు డైరెక్ట్‌ చెప్పిందట.

సల్మాన్ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌ల మాధిరిగానే అక్షయ్‌ కుమార్‌ - రవీనా టండన్‌ల ప్రేమ కథ కూడా బాలీవుడ్‌లో చాలా పాపులర్.
1994లో రిలీజ్‌ అయిన మొహ్రా సినిమా షూటింగ్‌లో అక్షయ్‌, రవీనాలు పరిచయం అయ్యారు. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.

రవీనా, అక్షయ్‌లు ప్రేమలో ఉన్న సమయంలోనే అక్షయ్‌, రేఖల ప్రేమ గురించి పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తలు ఎక్కువ కావటంతో రవీనా, రేఖను అక్షయ్‌కు దూరంగా ఉండమని కోరింది.
అక్షయ్‌ - రేఖలు 1996లో రిలీజ్ అయిన ఖిలాడియోంకి ఖిలాడీ సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. ఆ తరువాత వారి మధ్య ఏదో జరుగుతుందన్న వార్త బాలీవుడ్‌లో వైరల్ అయ్యింది. ఆ వార్తలతో రవీనా చాలా డిస్ట్రబ్‌ అయ్యింది.
అక్షయ్‌, రేఖల వ్యవహారం రేఖను దారుణంగా డిస్ట్రబ్‌ చేసింది.
గతంలో రెడిఫ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా. `అక్షయ్‌, రేఖల మధ్య ఏం లేదని నేను అనను. నిజానికి అక్షయ్‌ రేఖనుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆమె అక్కి కోసం లంచ్‌ బాక్సులు కూడా తీసుకువచ్చేది` అని చెప్పింది. ఆ సమయంలో తాను ఎంటరై వారి బంధాన్ని కట్ చేశానని చెప్పింది.
సినీ గిడ్జ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో `అక్షయ్‌, రేఖ సన్నిహితంగా ఉన్నట్టుగా నాకు కనిపిస్తే ఆమె చెంప పగలగొట్టేదాన్ని. అయితే అక్షయ్‌కు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు` అని కామెంట్ చేసింది.
అయితే అక్షయ్‌, రేఖల వ్యవహారం తరువాత అక్షయ్‌, శిల్పా శెట్టిల రిలేషన్‌ కూడా హాట్‌ టాపిక్‌ అయ్యింది. దీంతో రవీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకదశలో శిల్ప కోసం అక్షయ్‌, రవీనాను మోసం చేశాడన్న ప్రచారం కూడా జరిగింది. కొద్ది రోజుల తరువాత శిల్పతో బ్రేకప్‌ కావటంతో ట్వింకిల్‌ ఖన్నాను పెళ్లిను చేసుకున్నాడు.

Latest Videos

click me!