అయితే ఈ కేసులో ఏ1 సుఖేష్ చంద్రశేఖర్ మాత్రం తనకి జాక్వెలిన్, నోరా ఇద్దరితో సంబంధాలు ఉన్నట్లు బల్ల గుద్ది చెబుతున్నాడు. ఇద్దరికీ ఎన్నిసార్లు డబ్బు ఇచ్చింది, ఏఏ గిఫ్టులు ఇచ్చింది అన్ని వివరాలని సుఖేష్ ఈడీకి పూసగుచ్చినట్లు వివరిస్తున్నాడు. నోరా ఫతేహికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు గిఫ్టుగా ఇచ్చినట్లు కూడా సుఖేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. అతడి కామెంట్స్ ని నోరా ఫతేహి ఈడీ విచారణకు హాజరైనప్పుడు తెలిపింది.