వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో విరబూసిన రోజా.. హనీ రోస్ మైండ్ బ్లోయింగ్ లుక్స్,కుర్రాళ్ళకి కిక్కే కిక్కు

First Published Jan 22, 2023, 9:04 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. 

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. 

బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. గోపీచంద్ బాలయ్యని ఫ్యాన్స్ కోరుకునే విధంగా పర్ఫెక్ట్ మాస్ అవతారంలో ప్రజెంట్ చేశారు. 

ఇప్పటికి ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీనితో చిత్ర యూనిట్ నేడు జెఆర్సీ కన్వెన్షన్ లో వీరసింహుని విజయోత్సవం పేరుతో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ హంగామాతో సక్సెస్ సెలబ్రేషన్ వేడుక జోరుగా సాగుతోంది. 

ఈ చిత్రంతో కేరళ బ్యూటీ 31 ఏళ్ల హనీ రోస్ కీలక పాత్రలో బాలయ్య సరసన నటించి మెప్పించింది. వీరసింహారెడ్డి మరదలిగా హనీ రోస్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసి మెప్పించింది. 

బాలయ్య మరదలిగా యంగ్ క్యారెక్టర్ లో.. అలాగే తల్లిగా ఏజ్డ్ రోల్ లో హనీ రోజ్ వేరియషన్స్ చూపించింది. దీనితో వీరసింహారెడ్డి చిత్రంతో హనీ రోస్ కి మంచి గుర్తింపు దక్కింది.

 తెలుగు యువత అంతా ప్రస్తుతం హనీ రోస్ జపం చేస్తున్నారు. హనీ రోస్ పాత్ర ఈ చిత్రంలో శృతి హాసన్ ని డామినేట్ చేసింది అనే చెప్పాలి. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న విజయోత్సవ వేడుకకు హనీ రోస్ కూడా హాజరైంది. మైండ్ బ్లోయింగ్ లుక్స్ లో బ్లూ డ్రెస్ లో హనీ రోజ్ మెరిసింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే అందంతో హనీ రోజ్ చూపు తిప్పుకోనీయడం లేదు. 

నిజమైన రోజా పువ్వు విజయోత్సవ వేడుకలో విరబోసిందా అన్నట్లుగా హనీ రోజ్ మైండ్ బ్లాక్ చేసింది. ఆమె చిరునవ్వు, లుక్స్ కుర్రాళ్లలో అలజడి సృష్టిస్తున్నాయి. 

click me!