బిగ్‌ బాస్‌ నష్ట నివారణ చర్యలు.. బూస్ట్ ఇచ్చేందుకు మాస్టర్‌ ప్లాన్‌.. రంగంలోకి సుడిగాలి సుధీర్?

Published : Oct 03, 2022, 05:26 PM IST

బిగ్‌ బాస్‌ 6 తెలుగు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందడం లేదు. ఎంత ప్రయత్నించినా ఊపు రావడం లేదు. నాగార్జున  కూడా ఏం చేయలేని పరిస్థితి. దీంతో మాస్టర్‌ ప్లాన్‌ చేస్తున్నారు నిర్వహకులు.   

PREV
15
బిగ్‌ బాస్‌ నష్ట నివారణ చర్యలు.. బూస్ట్ ఇచ్చేందుకు మాస్టర్‌ ప్లాన్‌.. రంగంలోకి సుడిగాలి సుధీర్?

బిగ్‌ బాస్‌ తెలుగు హిస్టరీలోనే అత్యంత దారుణమైన రేటింగ్‌ ఈ సీజన్‌కే దక్కింది. హౌజ్‌లో కంటెస్టెంట్లు ఆశించిన స్థాయిలో గేమ్‌ ఆడటం లేదు. గొడవలు,  ఆసక్తికర  విషయాలేం జరగడం లేదు. కంటెస్టెంట్లంతా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. దీంతో షో రక్తికట్టడం లేదు. మరీ బోరింగ్‌గా తయారైంది. ఒక్కరిద్దరు తప్ప హౌజ్‌లో బాగా ఆడేవారు లేరు. దీంతో ఆడియెన్స్ షోపై ఆసక్తి చూపడం లేదు. పైగా తెలిసిన ఫేస్‌లు కూడా లేకపోవడంతో ఆసక్తి తగ్గిపోయింది. 
 

25

ఇప్పటికే అత్యల్ప టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చిందని తెలుస్తుంది. రేటింగ్‌ని కూడా ప్రకటించలేదు నిర్వహకులు. దీంతో దీనిపై నిర్వహకులు ఆలోచనలో పడ్డారట. దీన్ని ఆపేయాలా? అనే ఆలోచన కూడా వచ్చిందట. ఈ రూమర్స్ నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ క్రేజీ ఆలోచన చేశారట. వైల్డ్ కార్డ్ ద్వారా ఓ క్రేజీ ఆర్టిస్ట్ ని రంగంలోకి దించుతున్నారట. 

35

`జబర్దస్త్` షో ద్వారా  పాపులర్‌ అయ్యారు సుడిగాలి సుధీర్‌. ప్రస్తుతం సినిమాల్లో, మరోవైపు `సూపర్‌ సింగర్‌ జూనియర్‌` షోలో సందడి చేస్తున్న ఆయన `బిగ్‌ బాస్‌` లోకి రాబోతున్నారట. `బిగ్‌ బాస్‌ 6` నిర్వహకులు ఇప్పుడు సుడిగాలి  సుధీర్‌ని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే సుడిగాలి సుధీర్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నట్టు సమాచారం. 
 

45

టీవీలో సుడిగాలి సుధీర్‌కి మంచి క్రేజ్‌ ఉంది.  ఆయన `జబర్దస్త్`లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. అత్యంత పాపులర్‌ ఆర్టిస్ట్ గా తెచ్చుకున్నారు. బుల్లితెర స్టార్‌గా వెలుగుతున్న సుధీర్‌ని తీసుకొస్తే టీవీ ఆడియెన్స్ ని ఆకర్షించొచ్చని, ఇది షోకి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

55

అయితే బిగ్‌ బాస్‌లోకి రావడానికి సుడిగాలి సుధీర్‌కి భారీగానే పారితోషికం తీసుకుంటున్నారట. ఊహించిన పారితోషికం ఆయనకు ఇస్తున్నట్టు సమాచారం. షోని రక్తికట్టించేందుకు ఎంత అయినా  ఇచ్చేందుకు కూడా నిర్వహకులు సిద్ధంగా ఉండటం విశేషం. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ 6 షో నాలుగు వారాలు  పూర్తి చేసుకుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories