రష్మీతో హ్యాపినెస్ అన్న సుధీర్... తన లైఫ్ లో ఇదే బెస్ట్ డెసిషన్ అంటూ `జబర్దస్త్` యాంకర్‌ కన్నీళ్లు..

Published : Aug 15, 2021, 12:22 PM ISTUpdated : Aug 15, 2021, 02:27 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. `జబర్దస్త్` షోలో ఆమె తన బెస్ట్ డెసీషన్‌ చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. అది తన లైఫ్‌లోనే బెస్ట్ డెసీషన్‌ అంటూ స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యింది. అందరిచేత కన్నీళ్లు పెట్టించింది రష్మీ.  

PREV
18
రష్మీతో హ్యాపినెస్ అన్న సుధీర్... తన లైఫ్ లో ఇదే బెస్ట్ డెసిషన్ అంటూ `జబర్దస్త్` యాంకర్‌ కన్నీళ్లు..

`జబర్దస్త్` షోలో సుడిగాలి సుధీర్‌, యాంకర్ రష్మీల మధ్య ఉండే కెమిస్ట్రీ గురించి తెలిసిందే. ఇదే ఈ కామెడీ షోకి హైలైట్‌. ప్రతి ఎపిసోడ్‌లోనూ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని హైలైట్‌గా చూపిస్తూ రేటింగ్‌ క్యాష్‌ చేసుకుంటుంది ఈటీవీ-మల్లెమాల. 
 

28

వీరిద్దరు అందరికి లవర్స్ గానే తెలుసు. ఘాటు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని అంతా నమ్ముతున్నారు. షో కోసం, రేటింగ్‌ కోసం ఇలా చేసినప్పటికీ ఆడియెన్స్ మాత్రం ఈ జోడీని రియల్‌ లైఫ్‌ జోడిగానే భావిస్తున్నారు. 

38

వీరిద్దరు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరికున్న ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి తమ ప్రేమని `జబర్దస్త్` వేదికగా చాటి చెప్పారు. 

48

తాను ఉన్నంత వరకు సుధీర్‌ కోసం డెడికేట్‌ చేస్తానని, తన లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ డెసీషన్‌ అని వెల్లడించింది. ఈ సందర్భంగా రష్మీ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

58

ఆ వివరాల్లోకి వెళితే.. నెక్ట్స్ వీక్‌ `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో విడుదలైంది. ఇందులో చివర్లో కమెడీయన్ల హ్యాపీయెస్ట్ మూవ్‌మెంట్లు, సంతోషకరమైన క్షణాలను పంచుకున్నారు. అందులో భాగంగా రాకెష్‌, భాస్కర్‌, నరేష్‌, సుడిగాలి సుధీర్‌, రష్మీ ఇలా అందరు తమ కెరీర్‌కి సంబంధించి హ్యాపీయెస్ట్ మూవ్‌మెంట్లని పంచుకున్నారు. ఎమోషనల్‌ అయ్యారు. `జబర్దస్త్` లైఫ్‌ ఇచ్చిన విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

68

ఈ క్రమంలో సుధీర్‌ స్పందించారు. తొమ్మిదేళ్ల క్రితం రష్మీ, తాను కలిసినట్టు చెప్పాడు. ఓ సినిమా కోసం వీరిద్దరు కలిసి పనిచేయాలనుకున్నారట. అది తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూవ్‌మెంట్‌ అని తెలిపారు.

78

రష్మీ మాట్లాడుతూ, నేను ఉన్నంత వరకు తనకి డెడికేట్‌ చేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఈ విషయంలో నేను వెరీ వెరీ హ్యాపీ ఈ డెసిషన్‌ తీసుకున్నందుకు. ఇది నా జీవితంలో బెస్ట్ డెసిషన్‌ అంటూ రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. 
 

88

మరి రష్మీ డెడికేట్‌ చేసేది సుధీర్‌ కోసమేనా? లేక మరెవ్వరి కోసమైనా అనేది తెలియాల్సి ఉంది. చూడబోతే సుధీర్‌ని ఉద్దేశించే రష్మీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రోమో ట్రెండ్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories