`పాన్ ఇండియా` గేమ్‌లో టాలీవుడ్ ని చిత్తు చేసిన బాలీవుడ్‌.. ప్రభాస్ రివేంజ్‌ తీర్చుకుంటాడా? ఆశలన్ని సలార్‌పైనే

Published : Dec 20, 2023, 11:39 AM ISTUpdated : Dec 20, 2023, 05:21 PM IST

2023లో టాలీవుడ్ మిశ్రమ ఫలితాలు చూసింది. పాన్ ఇండియా రేసులో మాత్రం వెనకబడింది. హిందీ సినిమాలు సత్తా చాటాయి. ఈ ఏడాది వారిదే పైచేయి అయ్యింది.   

PREV
111
`పాన్ ఇండియా` గేమ్‌లో టాలీవుడ్ ని చిత్తు చేసిన బాలీవుడ్‌.. ప్రభాస్ రివేంజ్‌ తీర్చుకుంటాడా? ఆశలన్ని సలార్‌పైనే

బాహుబలి మూవీతో పాన్ ఇండియా కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. బాహుబలి 2, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ చిత్ర విజయాలతో టాలీవుడ్  పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. బాహుబలి 2 నెలకొల్పిన రికార్డులు కొన్ని ఇంకా చెక్కు చెదరలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో తెరకెక్కిన బహుభాషా చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

211

చెప్పాలంటే 2022 బాలీవుడ్ కి చీకటి అధ్యాయం. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, రన్బీర్ కపూర్ షంషేర్, షాహిద్ కపూర్ జెర్సీ, టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హీరో పంటి 2, అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ బాక్సాఫీస్ వద్ద  ఫెయిల్ అయ్యాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఇక జనాలు థియేటర్స్ కి రారేమో అనే భయం బాలీవుడ్ మేకర్స్ లో ఏర్పడింది. 
 

311

అదే అదే సమయంలో సౌత్ చిత్రాలు దున్నేశాయి. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాధించింది. హిందీలో కూడా సత్తా చాటింది. ఆర్ ఆర్ ఆర్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. రాజమౌళి మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరారు. 
 

411

ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం ముగియక ముందే కెజిఎఫ్ 2 సునామీ మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ కి మించిన ఆదరణ నార్త్ లో కెజిఎఫ్ 2కి దక్కింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన క్రేజీ సీక్వెల్ వసూళ్ల వర్షం కురిపించింది. కనీస వసూళ్లు లేక హిందీ సినిమాలు అల్లాడుతుంటే ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 వందల కోట్లు కొల్లగొట్టాయి. దాంతో నార్త్ పై సౌత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినట్లు అయ్యింది...

511

కాగా 2023లో బాలీవుడ్ అనూహ్యంగా పుంజుకుంది. సౌత్ ఇండియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదు వందలకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు నమోదు అయ్యాయి. జవాన్, పఠాన్, గదర్ 2, యానిమల్ చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. హిట్ కోసం దశాబ్దానికి పైగా ఎదురు చూసిన షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టారు.

611


జవాన్ మూవీ మరో వెయ్యి కోట్ల చిత్రంగా నిలిచింది. ఫేడ్ అవుట్ అయిన సన్నీ డియోల్ గదర్ 2లో అద్భుతం చేశారు. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన గదర్ కి సీక్వెల్ గా విడుదలైన గదర్ 2 వరల్డ్ వైడ్ రూ. 687 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక యానిమల్ ప్రభంజనం గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 
 

711

రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ దారుణమైన క్రిటిసిజం ఎదుర్కొంది. పార్లమెంట్ వేదికగా ఈ సినిమాపై ఆరోపణలు వినిపించాయి. నెగటివ్ పుబ్లిసిటీ ప్లస్ అయిందేమో కానీ జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 843 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

811


అదే సమయంలో ఈ ఏడాది విడుదలైన టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలు చతికలబడ్డాయి. ప్రభాస్ ఆదిపురుష్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయ్యింది. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ నడిచింది. రామాయణ కావ్యాన్ని ఇష్టం వచ్చినట్లు తెరకెక్కించడంతో విమర్శలు తలెత్తాయి. హిందూవాదులు ఆదిపురుష్ మూవీని తీవ్రంగా వ్యతిరేకించారు. 

911

నాని దసరా తెలుగులో విజయం సాధించింది. హిందీలో ఎలాంటి ప్రభావం చూపలేదు. టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా మూవీగా విడుదలై అన్ని భాషల్లో పరాజయం పొందింది. ఇక బోయపాటి శ్రీను-రామ్ పోతినేని స్కంద గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ట్రోలింగ్ మెటీరియల్ గా మిగిలిపోయిన పాన్ ఇండియా చిత్రం అది.

1011
Kushi movie


విజయ్ దేవరకొండ-సమంతల ఖుషి సైతం హిందీ ఆడియన్స్ ని  మెప్పించలేకపోయింది. తెలుగులో ఓ మోస్తరు విజయం అందుకున్న ఖుషి హిందీలో ఎలాంటి ప్రభావం చూపలేదు. సందీప్ కిషన్ మైఖేల్, నిఖిల్ స్పై పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలై పరాజయం పొందాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. 

1111
Salaar

2023లో విడుదలవుతున్న చివరి పాన్ ఇండియా చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య వస్తున్న సలార్ తో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయం అంటున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా ప్రైడ్ ని ఈ సినిమా కాపాడుతుందని అందరు నమ్ముతున్నారు. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి...

Read more Photos on
click me!

Recommended Stories