సుడిగాలి సుధీర్‌ చిన్నప్పుడు కూడా అవే పనులు చేశాడా?.. ఆ రహస్యాలన్నీ రివీల్ చేయడంతో గగ్గోలు..

Published : Jun 03, 2024, 10:41 PM IST

సుడిగాలి సుధీర్‌..జబర్దస్త్ లో రష్మితో కలిసి ప్లేబాయ్‌ గేమ్ తో రచ్చ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన చిన్నప్పుడు చేసిన పనులన్నీ బయటపడ్డాయి. షాకిచ్చేలా ఉన్నాయి.   

PREV
17
సుడిగాలి సుధీర్‌ చిన్నప్పుడు కూడా అవే పనులు చేశాడా?.. ఆ రహస్యాలన్నీ రివీల్ చేయడంతో గగ్గోలు..

సుడిగాలి సుధీర్‌ అంటే ప్లేబాయ్‌ క్యారెక్టరే గుర్తుకు వస్తుంది. ఆయన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఇన్నాళ్లపాటు అదే ఫీలింగ్‌ని తెప్పించాడు అయితే ఇప్పుడు నిజంగానే ఆయన అసలు రూపాన్ని బయటపెట్టారు. చిన్నప్పుడు చేసిన పనులన్నీ షోలో అందరి ముందు చెప్పడం గమనార్హం. దెబ్బకి సుడిగాలి సుధీర్‌ కవర్‌ చేసుకోలేక గగ్గోలు పెట్టడం విశేషం.  
 

27

సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యాడు. తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను, సుడిగాలి సుధీర్‌ కలిసి చేసే కామెడీ షోలోనే హైలైట్‌గా నిలుస్తుంది. అంతగా ఆకట్టుకున్నారు. మధ్యలో హైపర్‌ ఆది ఈ టీమ్‌లోకి వచ్చాడు. అప్పుడు కామెడీ లెవల్‌ మరింత పెరిగింది. ఈ టీమ్‌ అంటే ది బెస్ట్ అనేలా పేరు తెచ్చుకుంది. 
 

37

అయితే జబర్దస్త్ షోలో సుధీర్.. యాంకర్‌ రష్మితో పులిహోర కలిపాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బిల్డ్ అయ్యింది. ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు. ఆటాపాటలతో అలరించారు. స్టేజ్‌పైనే ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిపారు. ఎంగేజ్మెంట్‌ చేసుకున్నారు. పెళ్లి వరకు వెళ్లారు. అంతగా తమ మధ్య కెమిస్ట్రీని రక్తికట్టించి షో టీఆర్‌పీ రేటింగ్‌ అమాంతం పెంచేశారు. ఆ సమయంలోనే సుధీర్‌ తన ప్లేబాయ్‌ క్యారెక్టర్‌ బయటపెట్టాడు. పీక్‌ లెవల్‌ని చూపించారు. 
 

47

సుధీర్‌లో ఈ ప్లేబాయ్‌ లక్షణాలు చిన్నప్పట్నుంచే ఉన్నాయట. ఆ విషయాలన్నీ బయటపడ్డాయి. సుధీర్‌.. ఇప్పుడు ఈటీవీలో కొత్తగా `ఫ్యామిలీస్టార్స్` షో చేస్తున్న విషయం తెలిసిందే. టీవీ ఆర్టిస్టులతో ఈ షోని రన్‌ చేస్తున్నారు. గేమ్‌లు, పాత విషయాలను గుర్తు చేసుకోవడం, కామెడీ చేయడం ఈ షో కాన్సెప్ట్. కామెడీ చేయడానికి ఏ దారైనా ఎంచుకోవచ్చు. అందులో భాగంగా ఒకప్పటి స్టార్‌ టీవీ ఆర్టిస్టులు ఈ షోకి వచ్చారు. లేటెస్ట్ ప్రోమోలో రచ్చ చేశారు. 
 

57

ఇందులో యాంకర్‌ స్రవంతి సుడిగాలి సుధీర్‌ని టార్గెట్‌ చేసింది. చిన్నప్పుడు ఆయన చేసిన పనులు బయటపెట్టింది. సుధీర్ బావ నేను మీ మరదలిని, చిన్నప్పుడు సునుండలు ఇచ్చి బుగ్గమీద ముద్దు పెట్టేవాడివి అంటూ సుధీర్‌ బండారం బయటపెట్టింది స్రవంతి. దీంతో అప్పటి రోజులు గుర్తు చేసుకున్నాడు సుధీర్‌. ఇప్పుడు సునుండలు తెచ్చావా అంటూ అడగడం విశేషం.
 

67

మరోవైపు నటుడు బాలాదిత్య కూడా అప్పటి విషయాలను చెప్పారు. చిన్నప్పుడు అమలాపురంలో గడ్డివాము పక్కన.. అంటూ చేయి కొట్టాడు బాలాదిత్య. దీంతో దెబ్బకి సుధీర్‌ విషయం తెలిసిపోతుందని ఆయన్ని కవర్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కానీ విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఏం చేశాడో అర్థమైపోయింది. దీంతోపాటు టీవీ నటుడు కూడా `చిన్నప్పుడు వెళ్లిపోయావు, వచ్చేశావా? దొరికిపోయావా?` అని అడగంతో తత్తిరి బిత్తిరి అయ్యాడు సుధీర్‌. 
 

77

ఇలా చిన్నప్పుడు ఆయన ఏం చేశాడో అందరి ముందు చెప్పడంతో సుధీర్‌ గగ్గోలు పెట్టుకున్నాడు. వాటిని కవర్‌ చేసుకోలేకపో నానా తంటాలు పడ్డారు. అయితే చిన్నప్పట్నుంచి సుధీర్‌ చేసే పనులు ఇవేనా? అనే అనుమానాలు రేకెత్తించేలా ఈ సంఘటనలు ఉండటం విశేషం. `ఫ్యామిలీ స్టార్‌` లేటెస్ట్ ప్రోమోలోని సన్నివేశాలివి. కామెడీ కోసం చేసిన ఈ స్కిట్లు నవ్వులు పూయించాయి. ఈ షో ఆదివారం ఏడున్నరకి ఈటీవీలో ప్రసారం అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories