హైపర్‌ ఆదికి ఐదేళ్ల కొడుకున్నాడా?.. ఇన్నాళ్లు దాచిన రహస్యం అందరి ముందు బట్టబయలు.. ఇదేం ట్విస్ట్?

Published : Jun 03, 2024, 06:34 PM IST

జబర్దస్త్ షోతో పాపులర్‌ అయిన హైపర్‌ ఆది ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయనకు కొడుకు ఉన్నాడట. తాజాగా ఆ విషయం బయటపడింది.   

PREV
17
హైపర్‌ ఆదికి ఐదేళ్ల కొడుకున్నాడా?.. ఇన్నాళ్లు దాచిన రహస్యం అందరి ముందు బట్టబయలు.. ఇదేం ట్విస్ట్?

హైపర్‌ ఆది.. నాలుగు పదులు దాటినా పెళ్లి లేదు. ఇప్పట్లో పెళ్లి ఆలోచనే చేయడం లేదు. ఆయన ఓవైపు కమెడియన్‌గా రాణిస్తున్నాడు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హైపర్‌ ఆదికి సంబంధించిన ఓ రహస్యం బయటపడింది. ఆయనకు కొడుకు ఉన్నాడట. అందరికి ముందు బట్టబయలైంది.  
 

27

హైపర్‌ ఆది జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీని పంచుతూ ఆకట్టుకుంటున్నాడు. పంచ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు. హైపర్‌ ఆది పంచ్ లు, ప్రాసలకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన జబర్దస్త్ లో కామెడీ చేసినా హైలైట్‌గా నిలుస్తుంది. మరోవైపు వేదికపై మాట్లాడినా అంతే హైలైట్ అవుతుంది. మాట్లాడుతున్నంతసేపు హోరెత్తిస్తుంటాడు ఆది. 
 

37

ఇదిలా ఉంటే హైపర్‌ ఆది ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`కే పరిమితమయ్యాడు. జబర్దస్త్ నుంచి ఆయన తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో జబర్దస్త్ షో క్రేజ్‌ తగ్గిపోయింది. మరోవైపు సినిమాల్లో బిజీ అవుతున్నాడు ఆది. ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లని అందుకుంటూ దుమ్మురేపుతున్నాడు. 
 

47

అయితే హైపర్‌ ఆది నాలుగు పదులు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. ఇంకా టైముందంటున్నాడు. గతంలో లవ్‌ ఫెయిల్యూర్‌ అనే విషయం కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు కెరీర్‌ పైనే ఫోకస్‌ పెట్టానని, పెళ్లి చేసుకోవడానికి టైమ్‌ పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఆయన బండారం బయటపెట్టారు యాంకర్‌ రష్మి, జడ్జ్ ఇంద్రజ. ఇన్నాళ్లు దాచిన విషయాన్ని అందరి ముందు బహిర్గతం చేశారు. 

57

హైపర్‌ ఆదికి కొడుకు ఉన్నాడట. దాదాపు నాలుగైదేళ్ల ఏజ్‌ ఉన్న కొడుకు ఉండటం విశేషం. ఆది ఫోటో పట్టుకుని ఆ కుర్రాడు తిరుగుతున్నాడు. ఇంద్రజ, రష్మిల కంట పడ్డాడు. మీ నాన్న ఎవరు అడిగితే హైపర్‌ ఆది ఫోటో చూపించాడు. ఇతనే మానాన్న అని, తనని వదిలేశాడని తెలిపారు. దీంతో స్టేజ్‌పైనే పంచాయతీ పెట్టారు. జబర్దస్త్ నరేష్‌ ఇది చూసి తట్టుకోలేకపోయాడు. 
 

67

నరేష్‌ని చూస్తే `అరేయ్‌ వాడు నా కొడుకేంటి? నువ్వు నమ్ముతావా? అని ఆది అడగ్గా, అన్నంత పని చేశావ్‌ కదరా అంటూ నరేష్‌ వాపోయాడు. నీతోనే ఉన్నా కదరా, వాడు నా కొడుకా అని మరోసారి ప్రశ్నించాడు ఆది, దీంతో `నీతో ఉన్నా, నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావ్‌ రా` అని మరోసారి నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అందరి ముందు హైపర్‌ ఆది బండారం బయటపడింది. 

77

`శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ప్రోమోలోని స్కిట్‌ ఇది. హైపర్‌ ఆదికి కొడుకు ఉన్నాడంటూ ప్రదర్శించిన ఈ స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇంద్రజ, రష్మిలు కలిసి ఆయన్ని ఆటపట్టించిన తీరు ఆకట్టుకుంది.ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. వచ్చే ఆదివారం ఈ పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories