మల్లెమాలకు సుడిగాలి సుధీర్ షాక్... జబర్దస్త్ కి వస్తానంటూ కొత్త కుంపటి పెట్టిన బుల్లితెర స్టార్ 

Published : Nov 20, 2022, 10:28 AM IST

జబర్దస్త్ కి తిరిగి వస్తున్నానంటూ పదే పదే చెబుతున్న సుడిగాలి సుధీర్ కొత్త షో స్టార్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సుధీర్ 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' పేరుతో నయా షోకి శ్రీకారం చుట్టాడు.

PREV
18
మల్లెమాలకు సుడిగాలి సుధీర్ షాక్... జబర్దస్త్ కి వస్తానంటూ కొత్త కుంపటి పెట్టిన బుల్లితెర స్టార్ 
Sudigali Sudheer


తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సుడిగాలి సుధీర్ నేతృత్వంలో  కామెడీ షో స్టార్ట్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో కొత్త కామెడీ షో షురూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. 
 

28
Sudigali Sudheer


కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకి సుడిగాలి సుధీర్ యాంకర్. యంగ్ బ్యూటీ దీపికా పిల్లి మరొక యాంకర్. ఇక స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2 నుండి ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రసారం కానుంది. 
 

38
Sudigali Sudheer


ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ ముక్కు అవినాష్, టిల్లు వేణుతో పాటు.. సద్దాం, జ్ఞానేశ్వర్, యాదమ్మ రాజు, హరి, భాస్కర్ టీమ్ లీడర్స్. ఇక వీరి స్కిట్స్ కి జడ్జి అనిల్ రావిపూడి కాకుండా ప్రేక్షకులే మార్క్స్ ఇస్తారు. షోకి హాజరైన ప్రేక్షకులు టీమ్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.  

48
Sudigali Sudheer


ప్రేక్షకుల తీర్పు ఆధారంగా ఎపిసోడ్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో షోపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆహా ప్రేక్షకులు షో పట్ల ఆసక్తిగా ఉన్నారు. 
 

58
Sudigali Sudheer

కాగా జబర్దస్త్ కి తిరిగి వస్తున్నాని చెబుతున్న సుడిగాలి సుధీర్ ఇలా కొత్త కుంపటి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ గాలోడు ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో జబర్దస్త్ గురించి మాట్లాడారు. మల్లెమాల సంస్థతో నాకు విబేధాలు లేవు. అనుమతితో విరామం తీసుకున్నాను. త్వరలో తిరిగి వస్తాను అన్నారు.

68
Sudigali Sudheer

సుధీర్ రీఎంట్రీ కోసం జబర్దస్త్ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా... ఇలా సడన్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సుధీర్ జబర్దస్త్ రీ ఎంట్రీ పై అనుమానాలు నెలకొన్నాయి. బహుశా సుధీర్ జబర్దస్త్ కి తిరిగి రాకపోవచ్చు అంటున్నారు. 
 

78
Sudigali Sudheer

ఇక జబర్దస్త్ కి పోటీగా కామెడీ స్టార్స్, అదుర్స్ తో పాటు పలు షోస్ ఇతర ఛానల్స్ లో ప్రసారమయ్యాయి. కానీ ఒక్కటి కూడా జబర్దస్ ని బీట్ చేయలేకపోయింది. మాజీ జబర్దస్త్ కమెడియన్స్ ని రంగంలోకి దించినా పోటీ ఇవ్వలేకపోయారు. సక్సెస్ చేయలేక మధ్యలో ఆపేశారు. 
 

88
Sudigali Sudheer

ఈ క్రమంలో సుధీర్ యాంకర్ గా మొదలైన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. అల్లు అరవింద్ ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. కామెడీ ఎక్స్చేంజ్ షో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. 
 

click me!

Recommended Stories