నేను అనాథని, నాకు ఎవరూ లేరు.. కన్నీళ్లు పెట్టిస్తున్న `జబర్దస్త్` కొత్త యాంకర్‌ తెరవెనుక జీవితం..

Published : Nov 20, 2022, 09:38 AM IST

నవ్వులు పూయించే `జబర్దస్త్` షో కమెడియన్ల నవ్వుల వెనుక అంతులేని కన్నీళ్లు ఉంటాయని తెలిసిందే. కొత్తగా వచ్చిన యాంకర్‌ సౌమ్య రావు జీవితంలోనూ కన్నీళ్లున్నాయి. అవి హృదయాన్ని కలచివేస్తున్నాయి.   

PREV
17
నేను అనాథని, నాకు ఎవరూ లేరు.. కన్నీళ్లు పెట్టిస్తున్న `జబర్దస్త్` కొత్త యాంకర్‌ తెరవెనుక జీవితం..

గత తొమ్మిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కి నవ్వులు పంచుతుంది జబర్దస్త్(Jabardasth) షో. ఇందులో పదుల సంఖ్యలో హాస్యనటులు తయారయ్యారు. యాంకర్లు, జడ్జ్ లు తయారవుతున్నారు. కొత్తగా సౌమ్య రావు(Sowmya Rao) యాంకర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. వచ్చినప్పట్నుంచి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. సమ్‌ థింగ్‌ స్పెషల్‌ అనిపించుకుంటుంది. 
 

27

ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ లో సందడి చేసింది సౌమ్య రావు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. తాను అనాథని అని చెప్పడం షాక్ కి గురి చేస్తుంది. హృదయాన్ని బరువెక్కిస్తుంది. 
 

37

ఆ మధ్య ఈటీవీ నిర్వహించిన కార్యక్రమంలో సౌమ్య రావు సందడి చేసింది. హైపర్‌ ఆదితో కలిసి ఆమె రచ్చ చేసి హైలైట్‌ అయ్యింది. ఇదే ఆమెని `జబర్దస్త్` షోకి యాంకర్‌గా ఎంపిక కావడానికి కారణమని చెప్పొచ్చు. అయితే అదే షోలో మీ గురించి ఏదైనా చెప్పండి అని యాంకర్‌ ప్రదీప్‌ అడగ్గా తాను తన లైఫ్‌ గురించి చెప్పనని పేర్కొంది. కానీ తనొక అనాథని పేర్కొంది. 
 

47

`నా లైఫ్‌ గురించి చెప్పను. నాకు అమ్మలేదు. నాన్న ఉండి కూడా లేడు. ప్రస్తుతం నేను ఓ అనాథని, నాకు ఎవరూ లేరు. ఇక్క ఉన్న వారందరికి అమ్మనో, నాన్ననో, బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు. కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను` అని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య రావు. అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. 
 

57

ఇక నాజూకు అందంతో కట్టిపడేసే సౌమ్యరావు గ్లామర్‌ పరంగానూ మతిపోగొడుతుంది. ఎంట్రీతోనే అదిరిపోయే అందాలతో జబర్దస్త్ ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇస్తుంది సౌమ్యరావు. తాజాగా ఆమె రెడ్‌ లెహంగా ఓణిలో మెరిసింది. ఓణి లేకుండా అందాల విందుకి తెరలేపింది. డాన్సు చేస్తూ ఆమె దిగిన ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

67

హాట్‌నెస్‌ ఇన్‌ బిల్ట్ గా ఉన్న ఈ భామ ఫోటో షూట్లో ఇచ్చే పోజులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఆమె చూపులు చురకత్తుల్లా గుచ్చేస్తున్నాయి. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

77

కన్నడకి చెందిన ఈ భామ మోడలింగ్‌ నుంచి టీవీ రంగంలో అడుగుపెట్టింది. ఒకటి రెండు షోలకు యాంకర్‌గానూ అలరించింది. తెలుగులో సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఏకంగా పాపులర్‌ కామెడీ షో `జబర్దస్త్` కి యాంకర్ గా ఎంపిక కావడం విశేషం. దీంతో ఆమె దశ తిరిగిపోయినట్టే అని అంటున్నారు. మరింత క్రేజ్‌, గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories