సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, కీలక ప్రకటన చేసిన జబర్థస్త్ కమెడియన్

First Published Nov 6, 2022, 9:19 AM IST

జబర్థస్త్ ఫ్యాన్స్ కు ..సుడిగాలి సుధీర్ ఆర్మీకి గుడ్ న్యూస్.. అందరూ షాక్ అయ్యేలా.. అభిమానులు  దిల్ ఖుష్ అయ్యేలాంటిన్యూస్ ఒకటి చెప్పాడు  సుడిగాలి సుధీర్. ఇంతకీ ఈ హీరో ఏమంటున్నాడంటే..? 
 

సుడిగాలి  సుధీర్ అంటే బుల్లితెరపై ఓ బ్రాండ్.  సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోలకు ఎంత ఇమేజ్ ఉందో.. స్మాల్ స్క్రీన్ మీద సుధీర్ కు అంత ఇమేజ్ ఉంది. ఒకప్పుడు ప్రభాకర్ ను టెలివిజన్ ఫ్యాన్స్ ఎంత ఇష్టపడేవారో.. అంతకంటే ఎక్కువగా యూత్ ఇప్పుడు సుధీర్ అంటే ఇష్టపడుతున్నారు. 
 

ముఖ్యంగా జబర్థస్త్ ఫ్యాన్స్ లో ఎక్కువ మంది సుధీర్ ఫ్యాన్సే ఉన్నారు. అయితే గత  కొంతకాలంగా జబర్దస్త్ షోకు సుధీర్  దూరంగా ఉండటంతో అంతా నిరాశలో ఉన్నారు. 
 

అయితే ఇది తప్పితే.. అటు  శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో అతన్ని చూడొచ్చులే అనుకున్నవారికి  షాక్ ఇస్తూ.. ఆ షో నుంచి  కూడా సుధీర్  దూరమయ్యాడు. అనుహ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రత్యేక్షమయ్యాడు. ఆ తర్వాత కొన్ని ఛానెల్స్ లో రకరకాల షోలతో అలరించిన సుధీర్ ఈ  మధ్య అసలు బుల్లితెరపై సరిగ్గా కనిపించడం మానేశాడు. 
 

సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్నాడు.జబర్దస్త్ షోకు సుధీర్ కావడంతో అతని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.ఈషోకు సుధీర్ దూరంకావడంతో సోషల్ మీడియాలో రకరకాల  రూమర్స్ హల్ చల్ చేశాయి. గొడవలంటూ రకరకాలుగా రాశాయి. అయితే మళ్లీ సుధీర్  జబర్దస్త్ షోకు తిరిగి వస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్  ఆశపడుతున్నారు.  అంతే కాదు కొన్ని సందర్భాల్లో కామెంట్ల రూపంలో అతినికి ఈ విషయాన్ని కన్వే చేశారు కూడా. 

ఫ్యాన్స్ కోరిక గురించి  తాజాగా ఓ ఇంటర్వ్యూలో  సుధీర్ ముందు యాంకర్ ప్రస్తావించగా.. సుధీర్ స్పందించాడు. తాను జబర్దస్త్ షోలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా.. జబర్థస్త్ షోకి తాను బ్రేక్ ఇచ్చాను తప్పించి.. షో నుంచి శాశ్వతంగా నిష్క్రమించలేదంటూ క్లారిటీ ఇచ్చాడు సుధీర్. 

Sudigali Sudheer - Rashmi gautam

తను వెళ్ళిపోయినా...మేనేజ్ మెంట్ తో మాట్లాడుకుని.. ఓ ఆరేడునెలలు గ్యాప్ తీసుకున్నానన్నారు సుధీర్. అంతే తప్పించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా తాను గొడవలు పడి జబర్థస్త్ నుంచి వెళ్లిపోలేదన్నారు సుధీర్. త్వరల జబర్థస్త్ లో తన ఫ్యాన్స్ నుఅలరించడానికి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఆయన తెలిపారు. 

ముఖ్యంగా యూత్‏లో సుడిగాలి సుధీర్‏కు ఉండే క్రేజ్  అంతా ఇంతా కాదు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  జబర్దస్త్ కమెడియన్ అయినా..  వేదికపై అమ్మాయల టాపిక్ వస్తే సుధీర్ మాట వినిపిస్తుంది. ముఖ్యంగా యాంకర్ రష్మీతో  లవ్ ఎపిసోడ్లు అతనికి యూత్ లో ఇమేజ్ పెంచాయి. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగిపోయింది. 

 సుధీర్, రష్మీ జోడీకి యూత్‏లో యమ ఫాలోయింగ్ ఉంది. ఈ జంటకు ఎంతో మంది అభిమానులున్నారు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తున్నాడు  సుధీర్. ఇప్పటికే చాలా సినిమాల్లో  కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించిన సుధీర్ మరో వైపు హీరోగా తనఅదృష్టాన్ని పరిక్షించుకుంటూనే ఉన్నాడు.  

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు గాలోడు సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. 

click me!