సందీప్ కిషన్ హీరోగా వెకటాద్రీ ఎక్స్ ప్రెస్ సినిమాత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కు వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. కాని ఈసినిమా తరువాత సందీప్ కెరీర్ మాత్రం పెద్దగా మారలేదు. రకుల్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతారం ఎత్తింది. ఇక తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ ఇలా టాప్ స్టార్స్ అందరితో నటించే ఛాన్స్ దక్కింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంట సూపర్ హిట్స్ ను ఆమె ఖాతాలో వేసుకుంది.