అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన స్కిట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో సుడిగాలి సుధీర్ పెళ్లి మ్యాటర్ ఆసక్తికరంగా మారింది. అనసూయ, మనో, చిత్ర, హేమచంద్ర వంటి వారి సమక్షంలో ఓ అమ్మాయి సుడిగాలి సుధీర్‌ని నిలదీయడం విశేషం. ఆమె తనని పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రశ్నించడంతో సుడిగాలి సుధీర్ ఆయోమయంలో పడ్డారు. అదే సమయంలో బయట నుంచి ఫ్రెండ్స్, గర్ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, ఇంటికొస్తున్నావా? అని, ఎప్పుడు కలుద్దామని అడుగుతుండటంతో అసలు బండారం బయటపడింది. ఇది గ్రహించిన ప్రియురాలు సుధీర్‌ని నిలదీసింది.