Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?

Published : May 22, 2026, 12:37 PM IST

బుల్లితెరపై యమా క్రేజ్ ఉన్న సుడిగాలి సుధీర్.. కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టాలు పడ్డాడు. ఫ్యామిలీని చూడటానికి కూడా వెళ్లే పరిస్థితి లేక, తక్కువ జీతంలో లైఫ్ ను నెట్టుకొచ్చాడు. ఇంతకీ సుధీర్ అందుకున్న ఫస్ట్ శాలరీ ఎంత? దానితో ఏం చేశాడో తెలుసా? 

PREV
15
సుడిగాలి సుధీర్ క్రేజ్

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అతనికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. టెలివిజన్ స్టార్లలో ప్రదీప్, సుధీర్ లకు ఉన్న ఇమేజ్ మరెవరికి లేదనే చెప్పాలి. అయితే ఆ ఇమేజ్ వెండితెరపై మాత్రం పనిచేయలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి..కొన్ని సినిమాలు చేసినా.. అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ మాత్రం.. స్టార్ హీరోలను మించి ఉంటుంది. . ‘జబర్దస్త్’ లో సాధారణ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, టీమ్ లీడర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. ఆతరువాత యాంకర్ గా మారి రష్మీ,ప్రదీప్ తో కలిసి పలు షోలు హోస్ట్ చేశాడు. ప్రస్తుతం స్టార్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు సుధీర్.

25
వెండితెరపై కనిపించని ప్రభావం..

బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన సుధీర్.. ఆతరువాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. టాలీవుడ్ లో హీరోగా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. సుధీర్ నాలుగు సినిమాల వరకూ చేసినా.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఆయన నటించిన ‘గాలోడు’ సినిమా మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ఆపరేషన్ సహస్ర’ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం సుధీర్ ‘హైలెస్సో’ అనే పాన్ ఇండియా మూవీలో సుధీర్ నటిస్తున్నాడు.

35
హోస్ట్ గా సుడిగాలి సుధీర్ బిజీ

సినిమాల కంటే కూడా సుధీర్ కి టెలివిజన్ లోనే అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఓటీటీ షోలలో కూడా యాంకర్‌గా బిజీగా ఉన్నాడు సుధీర్. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆట డ్యాన్స్ షో జీ తెలుగులో మంచి స్పందన రాబట్టింది. సుధీర్ అభిమానులు మిస్ అవ్వకుండా చూడటంతో.. ఈ షోకు మంచి టీఆర్పీలు వచ్చినట్టు తెలుస్తోంది. అంచలంచెలుగా ఎదుగుతూ వస్తోన్న సుధీర్.. కెరీర్ బిగినింగ్ లో ఏం చేసేవాడు. ఆయన ఫస్ట్ శాలరీ ఎంత? దాంతో సుధీర్ ఏం చేశాడో తెలుసా?

45
ఫిల్మ్ సిటీలో మెజీషియన్ గా..

విజయవాడలో ఇంటర్ అయిపోగానే సుడిగాలి సుధీర్ హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే మ్యాజిక్ షోలు చేయడంలో కాస్త అనుభవం ఉన్న అతనికి.. రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న జాబ్ వచ్చింది. జీతం 8 వేలు. లైవ్ లో చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేస్తూ, వచ్చిన వారిని ఎంటర్టైన్ చేయాలి. సెలవులు ఉండవు.. వీకెండ్ లో వచ్చేవారు ఎక్కువ ఉంటారు. అంత తక్కువ జీతానికి సెలవులు లేకుండా పనిచేసేవాడు సుధీర్. ఆ కష్టపడే మనస్తత్వమే సుధీర్ ను స్టార్ గా నిలబెట్టింది.

55
ఫస్ట్ శాలరీతో ఏంచేశాడంటే?

ఎప్పుడైనా ఇంటికి వెళ్లాలంటే సుధీర్ కు కుదిరేది కాదు. కానీ జీతం వచ్చినప్పుడు మాత్రం ఒక పూట ఇంటికి వెళ్లి వచ్చేవాడట. తనకు వచ్చిన 8 వేలజీతంలో అమ్మా,నాన్న, తమ్ముడికి బట్టలు తీసుకుని... అర్ధ రాత్రి ఫిల్మ్ సిటీ హైవే మీద లారీ ఎక్కి.. బెజవాడ వెళ్లేవాడు. రాత్రి అందరికి బట్టలు పెట్టి..మళ్లీ పొద్దున్నే అక్కడ ఎక్కి.. మధ్యాహ్నం డ్యూటీ ఎక్కేవాడు . ఇలా సుధీర్ చాలా కష్టపడి తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ విషయాలను సుధీర్ స్యయంగా ఓ షోలో వెల్లడించాడు.

Read more Photos on
click me!

Recommended Stories