రష్మితో పెళ్ళి.. మరోసారి తేల్చేసిన సుడిగాలి సుధీర్.. ప్యాన్స్ ఏమంటున్నారంటే..?

Published : Aug 31, 2023, 07:22 AM IST

రష్మీతో ప్రేమ.. పెళ్ళి గురించి మరోసారిక్లారిటీ ఇచ్చాడు.. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్. ఆన్ స్క్రీన్ లో వీరి లవ్, రొమాన్స్ కు.. ఆఫ్ స్క్రీన్ సమాధానం ఏం చెప్పాడంటే..?   

PREV
18
రష్మితో పెళ్ళి.. మరోసారి తేల్చేసిన సుడిగాలి సుధీర్.. ప్యాన్స్ ఏమంటున్నారంటే..?

సుడిగాలి సుధీర్ జబర్థస్త్ ను వీడి చాలా కాలం అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ రష్మీ, సుధీర్ ల ప్రేమ, పెళ్ళీ అంటూ మాట్లాడుతున్నారంటే.. వారి ప్రభావం ఆడియన్స్ మీద ఎంత  ఉందో అర్ధం అవుతుంది. అంతే కాదు.. ఆన్ స్క్రీన్ వీరిది సూపర్ హిట్ జంట. అటు జబర్థస్త్ టీమ్ కుడా ఈ విషయాన్ని బాగా వాడుకున్నారు. స్టేజ్ మీద వీరికి సబంధించి ఏదో ఒక యాక్టివిటీ ఉండేట్టు చూసుకునేవారు. 

28

ఇక జబర్ధస్త్ ను పక్కన పెడితే.. ప్రత్యేకంగా సుధీర్ , రష్మీ ప్రేమ, పెళ్ళికి సబంధించి ఈ వెంట్లనే క్రియేట్ చేశారంటే..? బుల్లితెరపై  వీరి జోడీ ఎంత హిట్ అయ్యిందో  తెలుస్తుంది.  జబర్దస్త్  ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా పేరు దక్కించుకున్న సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు. 

38

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో కమెడియన్ గా పనిచేసి .. అక్కడే యాంకర్ రష్మీతో ఆయన నడిపిన ప్రేమాయణం ఎంతలా పాపులారిటీని అందించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా సుధీర్ అంటే రష్మీ.. రష్మీ అంటే సుధీర్ అన్నంతగా మారిపోయింది ఈ జంట. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా షోకి హైలెట్ గా నిలిచేది. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
 

48
Sudigali Sudheer - Rashmi gautam

కొన్ని షోలకు హోస్టింగ్ కూడా చేసిన సుధీర్.. ప్రస్తుతం హీరోగా బిజీ అవుతున్నాడు.. చేతి నిండా సంపాదిస్తున్నాడు కూడా. ఇప్పుడు బుల్లితెర షోలకు దూరంగా ఉంటున్నాడు.  తన పూర్తి ఫోకస్ ను సినిమాల పైన పెట్టిన ఈయన గాలోడు సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకొన్న సుధీర్ నుంచి  ప్రస్తుతం గోట్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 

58

ఇక తాజాగా ఈమూవీ ప్రమోషన్స్ కు సంబధించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు సుధీర్. ఇక ఎప్పటిలాగే సుధీర్ కు  పెళ్ల్ళి ప్రశ్నలు ఎదురవ్వగా.. దానికి ఆయన సమాధానంతో తేల్చేశాడు. రష్మీతో రొమాన్స్, ప్రేమ, పెళ్ళి.. ఈ విషయాలలో క్లారిటీ కూడా ఇచ్చేశాడు సుడిగాలిసుధీర్. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..? 

68

ఈ క్రమంలోనే సుధీర్, రష్మీలు వివాహం చేసుకుంటారా అన్న ప్రశ్నలు రాగా ఆయన ఖండిస్తూ.. తాము మంచి స్నేహితుల మాత్రమే అని వెల్లడించారు . అంతే కాదు ఫ్యాన్స్ కు మరో షాక్ కూడా ఇచ్చాడు సుధీర్, తాను అసలు పెళ్ళి చేసుకోను అంటున్నాడు. మీరు పెళ్ళాడే అమ్మాయిలో.. ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు అని అడగ్గా.. దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. 

78

పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే తనకు కాబోయే భార్యలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆలోచించుకుంటారు.. అయితే నాకు ఆ ఉద్దేశమే లేదు… అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు అంటూ అభిమానులను నిరాశపరిచారు.

88

ఒకవేళ చేసుకోవాల్సిన సమయం వస్తే మాత్రం తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎప్పుడు చాలా కూల్ గా.. సంతోషంగా.. అందరితో కలివిడిగా ఉండేలాగా ఉంటే చాలు అని అంతకుమించి ఎటువంటి లక్షణాలు అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో పెళ్లి ఊసే ఎత్తని సుధీర్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories