‘బెదురులంక2012’పై శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘సగిలేటి కథ’, ‘మా ఊరి పొలిమేర 2’, ‘నరకాసుర’.. అప్డేట్స్

First Published | Aug 30, 2023, 11:21 PM IST

‘బెదురులంక2012’ మూవీ సక్సెస్ మీట్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. గెస్ట్ గా హీరో శ్రీవిష్ణు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ‘సగిలేటి కథ’, ‘మా ఊరి పొలిమేర 2’, ‘నరకాసుర’ చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ అందాయి. 
 

ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ (Kartikeya), నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రవీంద్ర (బెన్నీ) బెనర్జీ ముప్పనేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడు. ఆగస్టు 25న విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో మేకర్స్ సక్సెస్ మీట్ అరెంజ్ చేశారు. కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) హాజరై మాట్లాడారు. ‘‘క్లాక్స్ నాకు ఈ కథను 2009లోనే చెప్పాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం. నిర్మాతలు ముందుకు రారని, కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను చేయమని చెప్పాను. మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. నేహా శెట్టి పేరు నాకు తెలీదు. రాధిక మాత్రమే తెలుసు. ఇప్పుడు చిత్ర అంటున్నారు. ఆర్ఎక్స్ 100 పిల్లా రా పాట విని షాక్ అయ్యాను. అందులో కార్తికేయను చూసి ట్వీట్ చేశాను. ఆర్ ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కొత్త కొత్త పాత్రలు చేస్తూనే ఉన్నాడు. పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు బెదురులంకతో హిట్ కొట్టేశాడని సంతోషం వ్యక్తం చేశారు. 
 

అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ భూపతి మాట్లాడారు. ‘‘సినిమా టీంకు కంగ్రాట్స్. ఆర్ఎక్స్ 100 అందరికీ లైఫ్ ఇచ్చింది. కానీ నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం కార్తికేయ. ఆ సినిమాను నిర్మించింది ఆయనే. కార్తికేయకు హిట్ వస్తే నాకు కూడా హిట్ వచ్చినట్టే.. అని అన్నారు. హీరో కార్తీకేయ మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఆ తర్వాత ఒక్క హిట్ వస్తే చాలు అనుకున్న టైంలోనే బెదురులంక వచ్చింది. నన్ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు.  అలాగే నిర్మాత, హీరోయిన్ నేహా శెట్టి కూడా తమ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. 

Latest Videos


మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ చేతుల మీదగా ‘సగిలేటి కథ’ మూవీలో నుంచి 'అట్టా ఎట్టాగా' రెండో లిరికల్‌ సాంగ్‌ ను డిజిటల్ లాంచ్ చేశారు. రవి మహాదాస్యం(Ravi Mahadasyam), విషిక లక్ష్మణ్‌(Vishika Laxman) జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ(Sagiletikatha)’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. 
 

`మా ఊరి పొలిమేర -2` చిత్రం విడుదలకు సిద్ధమైంది.  శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు.  స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని నవంబ‌ర్ 2న  గ్రాండ్ గా విడుద‌ల‌ చేయబోతున్నట్టు ఈరోజు ప్రకటించారు. 

వచ్చే నెలలో భారీ చిత్రాలతో రాబోతున్న చిన్న సినిమాల్లో ‘నరకాసుర’ ఒకటి. సెప్టెంబర్‌ రెండో వారంలో గ్రాండ్‌గా రాబోతోంది. రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతోంది. సెబాస్టియన్‌ దర్శకుడు. సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ రెండో వారంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 

click me!