ఆ విషయంలో విజయ్  దేవరకొండను టిప్స్ అడిగిన సుడిగాలి సుధీర్... నువ్వు నాకంటే సీనియర్ అంటూ రౌడీ హీరో ఝలక్!

Published : Apr 04, 2024, 05:36 PM IST

ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఓ షోకి గెస్ట్ గా వచ్చాడు. సదరు షోలో యాంకర్ గా ఉన్న సుడిగాలి సుధీర్ ఒక టిప్ అడిగాడు. ఆ విషయంలో నువ్వే సీనియర్ నన్ను అడగకు అని విజయ్ దేవరకొండ కౌంటర్ వేశాడు. ఇంతకీ సుడిగాలి సుధీర్ ఏమి అడిగాడో చూద్దాం... 

PREV
16
ఆ విషయంలో విజయ్  దేవరకొండను టిప్స్ అడిగిన సుడిగాలి సుధీర్... నువ్వు నాకంటే సీనియర్ అంటూ రౌడీ హీరో ఝలక్!
Eesari pandaga manade special event

బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ చాలా కాలం తర్వాత ఈటీవీలో సందడి చేశాడు. ఉగాది కానుకగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్ 'ఈసారి పండగ మనదే' షోలో సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించారు. 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

26
Eesari pandaga manade special event

ఈసారి పండగ మనదే ఈవెంట్ లో బలగం మూవీ టీం, హ్యాష్ నైంటీస్ వెబ్ సిరీస్ టీమ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో శివాజీ, బలగం వేణు మధ్య నవ్వులు పూయించే మాటలు చోటు చేసుకున్నాయి. ఒకరికి మరొకరు ఉగాది పచ్చడి తినిపించుకున్నారు. ఒకరిపై మరొకరు పంచులు వేసుకున్నారు. 
 

36
Eesari pandaga manade special event

ఈ షోలో హైపర్ ఆది సైతం పాల్గొన్నాడు. వస్తూనే సుడిగాలి సుధీర్ మీద పంచులు వేశాడు. ఎవరో బంధువు వస్తున్నాడు అన్నారు... రాబందు వచ్చాడేంటి అని సుధీర్ ని ఉద్దేశించి అన్నాడు. గొడవలు జరుగుతున్నాయి రా అని సుధీర్ అనగా, ఎవరిని గెలికావు అని హైపర్ ఆది మరో పంచ్ వేశాడు.

46
Eesari pandaga manade special event

ఇక ఫ్యామిలీ స్టార్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు ఈసారి పండగ మనదే షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ-సుడిగాలి సుధీర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 
 

56
Eesari pandaga manade special event


పెళ్లి కానీ యువతకు ఏవైనా టిప్స్ ఇవ్వండని విజయ్ దేవరకొండను సుడిగాలి సుధీర్ అడిగాడు. అందుకు సమాధానంగా విజయ్ దేవరకొండ... నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది కదా... నాకంటే సీనియర్ నువ్వు అన్నాడు. దానికి సెట్స్ లో ఉన్నవారందరూ నవ్వేశారు. 

66
Eesari pandaga manade special event


రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ తరచుగా వార్తలు వస్తుంటాయి. దీన్ని ఉద్దేశించి విజయ్ దేవరకొండ సుడిగాలి సుధీర్ కి పంచ్ విసిరాడు. ఈసారి పండగ మనదే స్పెషల్ ఈవెంట్ సరదా సరదాగా సాగింది. ఆడియన్స్ ని సుడిగాలి సుధీర్, హైపర్ ఆది నాన్ స్టాప్ గా నవ్వించారు. 

click me!

Recommended Stories