సుధీర్‌పై అనసూయ షాకింగ్‌ కామెంట్స్.. నా జూనియర్‌ అంటూ వ్యాఖ్య.. ఆడుకుంటున్న జబర్దస్త్ కమెడియన్ ఫ్యాన్స్

Published : Dec 15, 2022, 06:33 PM ISTUpdated : Dec 15, 2022, 07:35 PM IST

సుడిగాలి సుధీర్‌పై హాట్‌ యాంకర్ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన్ని జూనియర్‌ అంటూ కామెంట్‌ చేసిన నేపథ్యంలో సుధీర్‌ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అనసూయని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

PREV
17
సుధీర్‌పై అనసూయ షాకింగ్‌ కామెంట్స్.. నా జూనియర్‌ అంటూ వ్యాఖ్య.. ఆడుకుంటున్న జబర్దస్త్ కమెడియన్ ఫ్యాన్స్

అనసూయ(Anasuya) చాలా వరకు తన ఫోటో షూట్ల విషయంలోనే హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె దుస్తులు, గ్లామర్‌ షోపై నెటిజన్లు కామెంట్లు, వారికి అనసూయ కౌంటర్‌ చర్చనీయాంశం అవుతుంది. దీనికితోడు అనసూయ చేసే కామన్‌ కామెంట్లు కూడా వివాదాలకు, విమర్శలకు కారణమవుతుంటుంది. ఏదేమైనా అనసూయ తరచూ ట్రోలింగ్‌లో ఉంటుంది. 
 

27

ఇదిలా ఉంటే ఇప్పుడు అనసూయ.. సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer) ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యింది. సుధీర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈ ఎక్స్ జబర్దస్త్ యాంకర్ చేసిన కామెంట్లు వివాదంగా మారుతున్నాయి. దీంతో సుధీర్‌ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఈ హాట్‌ యాంకర్‌ని ఆడుకుంటున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. మరి ఇంతకేమైందంటే?

37

సుడిగాలి సుధీర్‌, అనసూయ కలిసి ఇటీవల `సూపర్ సింగర్‌ జూనియర్‌` షోకి యాంకర్లుగా చేశారు. అంతకు ముందు `వాంటెడ్‌ పండ్‌గాడ్‌` చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ యాంకర్‌ సుధీర్‌తో వర్క్ చేయడం ఎలా ఉందని అనసూయని ప్రశ్నించారు. దీనికి అనసూయ షాకింగ్, సెటైరికల్‌గా ఆన్సర్‌ ఇచ్చింది. 
 

47

సుధీర్‌ నాకు జూనియర్, ఆ విషయం మీకు తెలియదా అంటూ, ఈ ప్రశ్న ఆయన్నే అడగాలనేలా కాస్త రాష్‌గానే రియాక్ట్ అయ్యింది అనసూయ. ఆ తర్వాత ఆయన నానుంచి చాలా విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు. నేను కూడా సుధీర్‌ నుంచి నేర్చుకున్నానని తెలిపింది. ఇక్కడే సుధీర్‌ ఫ్యాన్స్ కి కాలింది. దీంతో అనసూయని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. 

57

అనసూయకి ఇంత యాటిట్యూడ్‌ ఎందుకంటూ రెచ్చిపోతున్నారు. రెండు మంచి పాత్రలు పడగానే ఇంత చూపిస్తుందా? అని, అందుకే నిన్ను ఆంటీ అనేదని ఒకప్పటి `ఆంటీ` మ్యాటర్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది టూ మచ్‌ ఆరోగెన్స్ అని, ఏ బిహేవియర్‌ ఏంటో  జనాలు, మరీ ఒంత పొగరా ఈవిడకి అంటూ తమదైన స్టయిల్‌లో కామెంట్లు పెడుతూ రచ్చ లేపుతున్నారు.
 

67

సుధీర్‌కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లో సగం కూడా ఈవిడకి ఉండరని, సుధీర్‌ క్రేజ్‌ ముందు ఏమాత్రం నిలవని అనసూయ ఇలా మాట్లాడుతుందా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. మరి దీనిపై అనసూయ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

77

`జబర్దస్త్`ని వీడిన అనసూయ సుధీర్‌తో చేసిన `సూపర్‌ సింగర్‌ జూనియర్‌` షో పూర్తయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క టీవీ షో కూడా లేదు. అదే సమయంలో సినిమాలు మాత్రం డజనుకుపైగానే ఉన్నాయి. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది అనసూయ. కానీ `జబర్దస్త్`లో ఉన్నంత క్రేజ్‌ ఇప్పుడు లేదు. క్రమంగా ఈ అమ్మడి ఫాలోయింగ్‌ పడిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories