విశాల్, సుచిత్ర
తమిళ చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరోగా పేరుగాంచిన విశాల్ నటించిన 'మద గజ రాజా' చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 12 సంవత్సరాలుగా విడుదల కాలేదు. ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారమై విడుదలకు సిద్ధమైంది. చాలా రోజుల తర్వాత విడుదలవుతున్నందున ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
విశాల్
కొద్ది రోజుల క్రితం 'మద గజ రాజా' చిత్రం ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో పాల్గొన్న నటుడు విశాల్ వణుకుతూ, తడబడుతూ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అయింది. విశాల్‌కి ఏమైందని చాలామంది ప్రశ్నించారు. ఆయనకు వైరల్ ఫీవర్ ఉందని, అందుకే ఆయన వణుకుతూ మాట్లాడారని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గాయని సుచిత్ర, విశాల్ ఈ పరిస్థితిని చూసి సంతోషిస్తున్నట్లు చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
సుచిత్ర
విశాల్ తన ఇంటికి వైన్ బాటిల్‌తో వచ్చిన ఘటనను ఆమె పంచుకున్నారు. సుచిత్ర, కార్తీక్ కుమార్‌తో కలిసి ఉంటున్న సమయంలో, ఒకరోజు రాత్రి కార్తీక్ కుమార్ ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపు తట్టే శబ్దం వినిపించి సుచిత్ర తలుపు తెరిచారట. అప్పుడు ఇంటి ముందు విశాల్ చేతిలో వైన్ బాటిల్‌తో నిల్చున్నాడట. విశాల్ మద్యం మత్తులో ఉన్నట్లు గ్రహించిన సుచిత్ర, లోపలికి రమ్మని అడిగితే, వద్దన్నాడట. తర్వాత చేతిలో ఉన్న వైన్ బాటిల్ ఇవ్వడానికి వచ్చానని చెప్పాడట.
విశాల్ గురించి సుచిత్ర
భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి వైన్ బాటిల్ ఇవ్వడంతో వద్దని చెప్పి తిరస్కరించిన సుచిత్ర, కార్తీక్ కుమార్, గౌతమ్ మీనన్ ఆఫీసులో ఉంటారని చెప్పి తిట్టి పంపించి వేసినట్లు తెలిపింది. ఇలాంటి విశాల్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. కానీ ఆయన చేతిలో మైక్ పట్టుకోలేక వణికిపోవడాన్ని చూసి నేను చాలా సంతోషించానని సుచిత్ర చెప్పారు. కర్మ అంటే ఇంతే.. తిరిగి మనకే వస్తుంది అంటూ సుచిత్ర చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి.