దిల్ రాజుకి 'అరుంధతి' ఒక పీడకల..పెట్టిన డబ్బంతా పోయింది, 300 కోట్ల బడ్జెట్ వరకు ఎలా ఎదిగారంటే

First Published | Jan 9, 2025, 2:09 PM IST

టాలీవుడ్ లో సినిమా నిర్మాణం విషయంలో దిల్ రాజు నిజమైన గేమ్ ఛేంజర్. కథలని సరైన విధంగా అంచనా వేయగలిగితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని నిరూపించిన నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో కష్టాలు పడ్డ దిల్ రాజు ఆ అనుభవంతో నిర్మాతగా మారి సూపర్ సక్సెస్ అయ్యారు.

టాలీవుడ్ లో సినిమా నిర్మాణం విషయంలో దిల్ రాజు నిజమైన గేమ్ ఛేంజర్. కథలని సరైన విధంగా అంచనా వేయగలిగితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని నిరూపించిన నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో కష్టాలు పడ్డ దిల్ రాజు ఆ అనుభవంతో నిర్మాతగా మారి సూపర్ సక్సెస్ అయ్యారు. దిల్ చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన ఆ చిత్రాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 

ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం ఇలా వరుస హిట్లతో దిల్ రాజు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో దివంగత నటి సౌందర్య నటించిన ఒక చిత్రంతో ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో వివరించారు. కాస్ట్యూమ్ కృష్ణ నిర్మించిన అరుంధతి అనే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను కొన్నాను. అనుష్క అరుంధతి కాదు.. అప్పట్లో సౌందర్య నటించిన అరుంధతి చిత్రం అది. 


Dil Raju

36 లక్షలకు కొన్నాను. రిలీజ్ అయ్యాక ఫస్ట్ షోకే అర్థం అయింది సినిమా డిజాస్టర్ అని. మొత్తానికి మొత్తం డబ్బు పోయింది. ఆ సినిమా రిజల్ట్ నాకు ఊహించని షాక్. అప్పట్లో 36 లక్షలు అంటే మామూలు విషయం కాదు. కాస్ట్యూమ్ కృష్ణారావు గారికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. సినిమా డిజాస్టర్ అయితే బయ్యర్లు డబ్బులు తిరిగి అడుగుతారేమో అని ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రిలీజ్ కి ముందు 34 లక్షలు చెల్లించాను. రిలీజ్ తర్వాత డబ్బంతా పోయింది అని తెలిసినా ఆయన ఇంటికి వెళ్లి మిగిలిన 2 లక్షలు కూడా చెల్లించాను. 

ఆయన ఆశ్చర్యపోయారు. సినిమా ఫ్లాప్ అయినా డబ్బు ఇస్తున్నావేంటి అన్నట్లుగా చూశారు. ఇచ్చిన మాట ప్రకారం 36 లక్షలు మీకు చెల్లించాలి. అందుకే ఈ డబ్బు తెచ్చా అని చెప్పా. నా నిజాయితీనే తర్వాత నాకు ఉపయోగపడింది. కాస్ట్యూమ్ కృష్ణారావు నిర్మించిన పెళ్లి పందిరి చిత్రాన్ని కూడా నేనే కొన్నాను. అది కనుక ఫ్లాప్ అయితే ఇక ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా. 60 లక్షలకు డీల్ కుదిరింది. నిర్మాత  ఎంఎస్ రెడ్డితో కలసి అనేక కష్టాలు పడి 60 లక్షలు చెల్లించాం. రిలీజ్ కి ముందు ఆర్థిక సమస్యలు వచ్చాయి. 

కాస్ట్యూమ్ కృష్ణగారికి ఇంకా కొంత చెల్లించాలి. నా నిజాయతీ చూసి ఆయన రిలీజ్ తర్వాత ఇవ్వులే అని చెప్పారు. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. నా సినీ కెరీర్ లో పెళ్లి పందిరి చిత్రం టర్నింగ్ పాయింట్ అని దిల్ రాజు తెలిపారు. సౌందర్య అరుంధతి చిత్రంతో 36 లక్షలు పోగొట్టుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న దిల్ రాజు.. నేడు రాంచరణ్ తో 300 కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ ఛేంజర్ చిత్రాన్ని నిర్మించే స్థాయికి ఎదిగారు.  కథ విషయంలో పట్టు తెచ్చుకుని కొత్త దర్శకులతో ఇన్వాల్వ్ కావడమే తన సక్సెస్ కి కారణం అని తెలిపారు. 

తన కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ కూడా చేశానని తెలిపారు. సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే రామరామ కృష్ణ కృష్ణ, జోష్, రామయ్య వస్తావయ్యా లాంటి చిత్రాలు కూడా హిట్ అయ్యేవి అని తెలిపారు. జోష్ చిత్రాన్ని నాగార్జున లాంటి స్టార్ హీరో కొడుకుతో కాకుండా కొత్త హీరోతో చేసి ఉంటే హిట్ అయ్యేది అని తెలిపారు. గేమ్ ఛేంజర్ చిత్రం మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ ని నిర్మాతగా ఏలిన దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతారేమో చూడాలి. 

Latest Videos

click me!