మాల్దీవ్స్ చెక్కేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి... సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసిన జంట!

First Published Apr 4, 2021, 7:57 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ బర్త్ డే సెలెబ్రేషన్స్ గట్టిగా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ ఆయన ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. 
 

అల్లు అర్జున్ కొడుకు బర్త్ డే వేడుకలు మాల్దీవ్స్ లో ప్లాన్ చేశారు. ఏప్రిల్ 3న అయాన్ బర్త్ డే కాగా, భార్య స్నేహరెడ్డి, కూతురు అర్హ, కొడుకు అయాన్ తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ మాల్దీవ్స్ వెళ్లారు.
undefined
నిన్న అయాన్ ఏడవ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. అయాన్ బర్త్ డే కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
undefined
అదే సమయంలో బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. దీనితో తండ్రి కొడుకులు.. సెలెబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లినట్లు సమాచారం.
undefined
ఇక అందమైన మాల్దీవ్స్ బీచ్ లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ స్టార్ కపుల్ ఫొటోలు సోషల్ మీడియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి.
undefined
మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ తో పాటు అనేక ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
undefined
బన్నీ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ గా పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ సిద్ధం చేశారు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ ని ఏప్రిల్ 7 సాయంత్రం విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు.
undefined
click me!