1990లో హిందీ చిత్రం భాగీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది నగ్మా(Nagma). అయితే ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది. అనతి కాలంలో ఎదిగిన నగ్మా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించింది.