హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (faria Abdhullah) ట్రెడిషనల్ వెర్లో మెస్మరైజ్ చేసింది. అమ్మడు నిండైన బట్టల్లో చందమామను గుర్తు చేసింది. ఈ పొడుగు భామ హోమ్లీ లుక్ ఫ్యాన్స్ కి సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
26
Faria Abdullah
హైదరాబాద్ భామ ఫరియాకు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.
36
Faria Abdullah
జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కొట్టింది. అత్యధిక లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక చిట్టి పాత్రలో ఫరియా ఒదిగిపోయి నటించింది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. జాతిరత్నాలు ఫరియాకు కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. కానీ జాతిరత్నాలు సక్సెస్ రేంజ్ లో ఆఫర్స్ రాలేదు.
46
Faria Abdullah
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు. హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు.
56
Faria Abdullah
ఫరియా హీరోయిన్ గా రావణాసుర చిత్రంలో నటించారు. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నారు.
66
Faria Abdullah
ప్రస్తుతం ఫరియా చేతిలో ఓ చిత్రం ఉంది. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది. అలాగే బోల్డ్ ఫోటో షూట్స్ కి వెనుకాడటం లేదు.