Crime Thriller: OTT లో సైకో సీరియల్ కిల్లర్ కథ.. అమాయకపు అమ్మాయిలే టార్గెట్.. అస్సలు మిస్ అవ్వొద్దు!

Published : Aug 13, 2026, 12:33 PM IST

Crime Thriller: మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కోసం చూస్తున్నారా? అయితే, ఓటీటీలో ఉన్న ఈ సినిమా మీకు కరెక్ట్ ఛాయిస్. ఇది ఒక నిజమైన సీరియల్ కిల్లర్ కథ ఆధారంగా తీసిన సినిమా. ఇంతకీ ఆ సినిమా ఏంటో, దాని కథేంటో చూద్దాం.

PREV
14
నిజ జీవిత ఘటనల ఆధారంగా కథ

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నా.. సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ కథలకు మాత్రం ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా, నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'స్టీఫెన్' అనే సినిమా.

ఈ సినిమా కథను 2021లో కేరళలో జరిగిన ఒక దారుణమైన క్రైమ్ స్టోరీ ఆధారంగా రాసుకున్నారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకమైన అమ్మాయిలను టార్గెట్ చేసిన స్టీఫెన్ జబరాజ్ అనే సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుస హత్యలు, వాటి వెనుక ఉన్న మిస్టరీలు, హంతకుడి ప్లాన్స్, పోలీసుల ఇన్వెస్టిగేషన్.. ఇలా సినిమా మొదలైనప్పటి నుంచి ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది.

24
ఊహించని మలుపులు
ఈ సినిమాకు అసలైన బలం ఇందులోని సస్పెన్స్, ఊహించని ట్విస్టులే. కథలో తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకులు అస్సలు ఊహించలేరు. హంతకుడు పోలీసులకు దొరకకముందే పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడం, ఆ తర్వాత కోర్టులో నేరాన్ని అంగీకరించడం వంటి సీన్స్ కథకు మరింత హైప్ క్రియేట్ చేస్తాయి. అయితే, ఆ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? స్టీఫెన్ గతం ఏంటి? పోలీసుల విచారణలో బయటపడిన షాకింగ్ నిజాలు ఏంటి? అనే ప్రశ్నలే సినిమాకు కీలకంగా మారాయి.
34
నటనతో అదరగొట్టిన గోమతి శంకర్
'స్టీఫెన్' సినిమాకు మిథున్ బాలాజీ దర్శకత్వం వహించి, కథను అందించారు. మానసిక రోగి అయిన సీరియల్ కిల్లర్ పాత్రలో గోమతి శంకర్ నటించారు. ఆయన నటన సినిమాకు మేజర్ హైలైట్ అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, కుబేరన్, విజయశ్రీ, అమర రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.
44
నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా చూడొచ్చు. నిజ జీవిత క్రైమ్ కథలంటే ఇష్టపడేవారికి 'స్టీఫెన్' ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుంది.
Read more Photos on
click me!

Recommended Stories