రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్లు.. అహంకారంతో అలా చేయలేదు, ఇప్పటికీ బాధపడుతున్న నటి

Published : Oct 06, 2025, 04:19 PM IST

రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన స్టార్లు చాలామందే ఉన్నారు. హీరో సూర్య, వివేక్ ఒబెరాయ్, సోనమ్ కపూర్ లాంటి స్టార్లు జక్కన్న ఆఫర్ రిజెక్ట్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. 

PREV
17
Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. అలాంటి దర్శకుడి దర్శకత్వంలో ఒక్క సినిమాలో నటించినా చాలు అని భావించే హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఉంటారు. కానీ రాజమౌళి సినిమాలని కూడా చాలా మంది స్టార్లు రిజెక్ట్ చేశారు. ఆ స్టార్లు ఎవరు, ఏ చిత్రాలని రిజెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 

27
సూర్య, వివేక్ ఒబెరాయ్ 

తమిళ స్టార్ హీరో సూర్య బాహుబలి ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. ఈ మూవీలో భల్లాల దేవుడు పాత్రకి ముందుగా రాజమౌళి అనుకున్నది సూర్యనే. కానీ ఆ పాత్రతో సూర్య కన్విన్స్ కాలేదు. దీనితో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే ఆఫర్ వివేక్ ఒబెరాయ్ కి వెళ్ళింది. వివేక్ ఒబెరాయ్ కి పాత్ర నచ్చింది కానీ ఎక్కువ డేట్లు అడ్జెస్ట్ చేయడం కుదరకపోవడంతో వదులుకున్నారు. 

37
శ్రీదేవి 

దివంగత నటి శ్రీదేవి కూడా రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకి ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. రెమ్యునరేషన్, ఇతర బెనిఫిట్స్ విషయంలో నిర్మాతలకు, ఆమెకి రాజీ కుదర్లేదు. రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. శ్రీదేవి శివగామి పాత్రని రిజెక్ట్ చేయడం తమ అదృష్టం అని అన్నారు. అప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. బాహుబలి నిర్మాతలు శ్రీదేవిపై లేనిపోని నిందలు వేస్తున్నారు అని బోనీ కపూర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.

47
బాలకృష్ణ, ప్రభాస్ 

సింహాద్రి కథని విజయేంద్ర ప్రసాద్ ముందుగా బాలకృష్ణ కోసం రాశారు. ఆ టైంలో బాలయ్య వరుసగా కత్తులతో ఫైట్స్ ఉండే సినిమాలు, ఫ్యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. సింహాద్రిలో కూడా భయంకరమైన కత్తి ఫైట్స్ ఉంటాయి. వరుసగా అదే తరహా చిత్రాలు చేయడం కరెక్ట్ కాదని బాలయ్య సింహాద్రి చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కథ ప్రభాస్ వద్దకు వెళ్ళింది. తన ఇమేజ్ కి ఈ కథ సెట్ కాదని  ప్రభాస్ కూడా రిజెక్ట్ చేశారు. చివరికి ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించి సంచలన విజయం అందుకున్నారు. 

57
అర్చన 

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిష స్నేహితురాలిగా నటించి గుర్తింపు పొందింది అర్చన. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. మగధీర చిత్రంలో రాజమౌళి ఆమెకి శ్రీహరి గర్ల్స్ ఫ్రెండ్ పాత్రని ఆఫర్ చేశారు. అది చాలా చిన్న రోల్. ఆ టైంలో హీరోయిన్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న అర్చన రాజమౌళి ఆఫర్ ని తిరస్కరించారు. దీనితో ఆ పాత్రలో సలోని నటించింది. ఆ ఛాన్స్ మిస్ చేసుకునేందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని అర్చన పేర్కొంది. అహంకారంతో రిజెక్ట్ చేయలేదు.. అప్పట్లో నాకు అంత తెలివి లేదు. ఆ మూవీ తర్వాత మర్యాద రామన్న చిత్రంలో సలోనికి మెయిన్ హీరోయిన్ గా రాజమౌళి ఛాన్స్ ఇచ్చారు. మగధీరలో నటించి ఉంటే.. మర్యాద రామన్న ఛాన్స్ కూడా నాకే దక్కేది అని అర్చన బాధపడింది. 

67
సోనమ్ కపూర్ 

బాహుబలి మూవీలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకి ముందుగా సోనమ్ కపూర్ ని అనుకున్నారు. సోనమ్ కపూర్ ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా హోస్ట్ గా చేసిన టాక్ షోలో బయటపెట్టింది. బాహుబలి ఆఫర్ ని వదులుకున్నానని పేర్కొంది. కానీ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణాలు మాత్రం రివీల్ చేయలేదు. 

77
పవన్ కళ్యాణ్ 

విక్రమార్కుడు చిత్రానికి ముందుగా పవన్ కళ్యాణ్ నే అనుకున్నారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కథ కూడా చెప్పారట. కానీ పవన్ వైపు నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదు. దీనితో ఆ చిత్రాన్ని జక్కన్న రవితేజతో తెరకెక్కించారు. 

Read more Photos on
click me!

Recommended Stories