StarMaa Top 10 Serials: స్టార్‌ మా టాప్‌ 10 సీరియల్స్ ఇవే.. బుల్లితెర ఆడియెన్స్ ఎక్కువ చూసిన సీరియల్ ఏంటంటే?

Published : Jul 18, 2025, 09:15 AM ISTUpdated : Jul 18, 2025, 09:18 AM IST

ప్రతి వారం సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్‌ వస్తుంటుంది. 27వ వారం(గత వారం) స్టార్‌ మాలో కొన్ని సీరియల్స్ స్థానాలు రివర్స్ అయ్యాయి. మరి ఎక్కువగా ఏ సీరియల్‌ని చూశారో తెలుసుకుందాం. 

PREV
18
`స్టార్‌ మా టాప్‌ 10 టీఆర్‌పీ రేటింగ్‌ సీరియల్స్

తెలుగు సీరియల్స్ కి సంబంధించిన ప్రతి వారం టీఆర్‌పీ రేటింగ్‌ వస్తుంటుంది. మరి గత వారం(27th week trp rating) స్టార్‌ మాలో టాప్‌ లో ఉన్న సీరియల్స్ కి సంబంధించిన టాప్‌ 10 సీరియల్స్ లిస్ట్ వచ్చింది. 

ఇందులో `కార్తీక దీపం`, `ఇల్లు ఇల్లాలు పిల్లలు`, `చిన్ని`, `ఇంటింటి రామాయణం`, `గుడి గంటలు`, `నువ్వుంటే నా జతగా`, `బ్రహ్మముడి` వంటి సీరియల్స్ టాప్‌లో ఉన్నాయి. వాటి స్థానాలు చూద్దాం.

28
మొదటి స్థానంలో `కార్తీకదీపం`

స్టార్‌ మాలో గత వారం కూడా నెంబర్‌ వన్‌గా `కార్తీక దీపం` సీరియల్‌ నిలిచింది. ఇది చాలా కాలంగా టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. స్టార్‌ మాలోనే కాదు, తెలుగు బుల్లితెరపై ఎక్కువ వ్యూస్ సాధిస్తున్న సీరియల్‌ ఇదే కావడం విశేషం.

 నిరూపమ్‌, ప్రేమి విశ్వనాథ్‌ జంటగా నటించే ఈ సీరియల్‌ అర్బన్‌, రూరల్‌ కలిసి 14.32 టీఆర్‌పీ రేటింగ్‌ సాధించింది. అర్బన్‌లో 11.13 రేటింగ్‌ని సాధించింది.

38
రెండు స్థానాలు పెరిగిన `గుడిగంటలు`

స్టార్‌ మాలో రెండో స్థానంలో ఉన్న సీరియల్‌ `గుండెనిండా గుడిగంటలు`. అంతకు ముందు నాల్గో స్థానంలో ఉన్న ఈ సీరియల్‌ ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చింది. 

దీనికి రూరల్‌, అర్బన్‌ కలిపి 13.03 రేటింగ్‌ రాగా, అర్బన్‌లో 11.35 రేటింగ్‌ వచ్చింది. అర్బన్‌లో ఇది `కార్తీక దీపం`ని మించి వ్యూస్‌ రావడం విశేషం.

48
మూడో స్థానంలో `ఇంటింటి రామాయణం`

మూడో స్థానంలో `ఇంటింటి రామాయణం` సీరియల్‌ నిలిచింది. ఈ సీరియల్‌ రూరల్‌, అర్బన్‌ కలిపి 12.95 రేటింగ్‌ని, అర్బన్‌లో 10.31 రేటింగ్‌ సాధించింది. ఇది గత వారం కూడా  ఇదే స్థానంలో ఉంది. పెద్దగా మార్పు లేదు.

58
రెండు స్థానాలు పడిపోయిన `ఇల్లు ఇల్లాలు పిల్లలు`

నాల్గో స్థానంలో `ఇల్లు ఇల్లాలు పిల్లలు` సీరియల్‌ నిలిచింది. ప్రభాకర్‌, ఆమని నటించిన ఈ సీరియల్‌ గత వారం రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది. ఇక ఇది రూరల్‌, అర్బన్‌ కలిపి 12.82 రేటింగ్‌, అర్బన్‌లో 10.11 రేటింగ్‌ సాధించింది.

68
ఐదో స్థానంలో `నువ్వుంటే నా జతగా`

ఐదో స్థానంలో `నువ్వుంటే నా జతగా` సీరియల్‌ నిలవడం విశేషం. ఇది గత వారం ఆరో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక్క స్థానం మెరుగుపడింది. ఇది అర్బన్‌, రూరల్‌ కలిపి 10.32 టీఆర్‌పీ రేటింగ్‌ని, అర్బన్‌లో 9.26 రేటింగ్‌ని సాధించింది.

78
6వ స్థానంలో `చిన్ని`, 7వ స్థానంలో `బ్రహ్మముడి`, 8వ స్థానంలో పలుకే బంగారమాయేనా`

ఆరో స్థానంలో `చిన్ని` సీరియల్‌ నిలించింది. ఇది ఒక్క స్థానం తగ్గింది. అర్బన్‌, రూరల్‌ కలిపి ఇది 8.26 రేటింగ్ ని, అర్బన్‌లో 6.70 రేటింగ్‌ని దక్కించుకుంది. 

ఏదో స్థానంలో `బ్రహ్మముడి` సీరియల్‌ ఉంది. ఇది అర్బన్‌, రూరల్‌ కలిపి 7.03, అర్బన్‌లో 6.59 రేటింగ్‌ని పొందింది. ఇది గత వారం కూడా సేమ్‌ ఉంది. 

ఎనిమిదో స్థానంలో `పలుకే బంగారమాయేనా` సీరియల్‌ ఉంది. ఇది అర్బన్, రూరల్‌ కలిపి 5.98 రేటింగ్‌ని, అర్బన్‌లో 5.66 రేటింగ్‌ని పొందింది.

88
9వ స్థానంలో `నిన్నుకోరి`, 10వ స్థానంలో `మామగారు`

తొమ్మిదో స్థానంలో `నిన్నుకోరి` సీరియల్‌ ఉంది. అర్బన్‌, రూరల్‌ కలిపి ఇది 5.89 రేటింగ్‌ని, అర్బన్‌లో 5.52 రేటింగ్‌ని దక్కించుకుంది. గత వారం ఇది కూడా సేమ్‌. 

అలాగే పదో స్థానంలో `మామగారు` సీరియల్‌ నిలిచింది. దీనికి అర్బన్‌, రూరల్‌ కలిపి 5.67, అర్బన్‌లో 5.41 రేటింగ్‌ని పొందింది. గత వారం ఇది కూడా పదో స్థానంలోనే ఉంది.

 వీటితోపాటు `పాపే మా జీవనజ్యోతి`, `మగువ ఓ మగువ`, `మల్లి`, `నిండు మనసులు`, `గీత ఎల్‌ఎల్‌బీ`, `భానుమతి`, `ఎల్లమ్మ` సీరియల్స్ మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories