చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన `ఇంద్ర` మూవీకి చిన్నికృష్ణ కథ అందించారు. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో మూవీ రాలేదు. ఈ క్రమంలో `ఇంద్ర 2` ప్రస్తావన వచ్చింది. దీనిపై ఆయన ఏం చెప్పాడంటే?
చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద హిట్ చిత్రాల్లో `ఇంద్ర` ఒకటి. ఇది కమర్షియల్ గా చిరంజీవిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఫ్యాక్షన్ సినిమాలంటే బాలయ్య కేరాఫ్ అనే ట్రెండ్ నడుస్తోన్న సమయంలో చిరంజీవి ఫ్యాక్షన్ మూవీ `ఇంద్ర` చేసి ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేశారు. ఇది కమర్షియల్‌గా బాలయ్య సినిమాలను దాటి వసూళ్లని రాబట్టింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి బి గోపాల్ దర్శకుడు కాగా, ఈ కథ అందించింది మాత్రం చిన్నికృష్ణ. ఆయన `నరసింహనాయుడు`, `గంగోత్రి`, `బద్రినాథ్`, `సీమ సింహం` వంటి చిత్రాలకు కథలు అందించారు.
25
చిరంజీవితో మూవీపై చిన్నికృష్ణ కామెంట్
అప్పట్లో చిన్నికృష్ణ స్టార్ రైటర్‌గా రాణించారు. అంతేకాదు అత్యంత విజయవంతమైన రైటర్‌గానూ రాణించారు. కానీ ఈ మధ్య గ్యాప్ వచ్చింది. రీసెంట్‌గా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాసరి నారాయణరావు కొడుకు సినిమా విషయంలో జరిగిన మిస్టేక్ వెల్లడించారు. దీంతోపాటు కొన్ని సినిమాలను తాను చేయకపోవడానికి కారణాలు తెలిపారు. ఈ క్రమంలో మెగాస్టార్‌తో సినిమా గురించి ఓపెన్ అయ్యారు. ఆయన చిరంజీవి `ఇంద్ర` మూవీకి కథ అందించిన నేపథ్యంలో `ఇంద్ర 2` ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తింది. దీనికి ఆయన స్పందించారు.
35
చిరంజీవిపై చిన్నికృష్ణ విమర్శలు
`ఇంద్ర 2` సినిమా అప్ డేట్ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ చిరంజీవికి సారీ చెప్పారు. చిన్నికృష్ణకి చిరంజీవి అంటే అభిమానం. చిన్నకృష్ణ అంటే కూడా చిరంజీవికి ప్రత్యేక అభిమానం. చిన్నికృష్ణ తన కొడుక్కి చిరంజీవి పేరు పెట్టాడు. అలాగే తన చెల్లికి కొడుకు పుడుతున్నప్పుడు, చిరంజీవి పుట్టిన రోజునే సిజేరియన్ ఆపరేషన్ జరగాలని ఆ రోజే చేయించుకున్నారు. ఇంత చేసిన తమని కనీసం ఇంటికి పిలిపించి అన్నం పెట్టలేదు అంటూ అప్పట్లో చిన్నికృష్ణ విమర్శలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి సారీ చెప్పారు. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సమయంలో వీరిద్దరు కలిశారు. ఆ సమయంలో చిరంజీవి చిన్నికృష్ణని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
తాజాగా మరోసారి చిన్నికృష్ణ స్పందించారు. `ఇంద్ర 2` ప్రస్తావన రాగా. చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. తాను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, మనం ప్రేమిస్తాం, మనల్ని ప్రేమించాలని రూల్ లేదు. మనల్ని కూడా ప్రేమించాలనే అజ్ఞానంలో అలా మాట్లాడాను, కానీ అలా ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తుంది. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఆయన్ని ప్రేమిస్తారు. అందరిని పిలిచి రెస్పెక్ట్ చేయాలనేది సాధ్యపడదు. అందుకే ఇంటికెళ్లి క్షమాపణలు కూడా చెప్పాను. మళ్లీ ఇప్పుడు చెబుతున్నా, అన్నయ్యా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదో అజ్ఞానంలో మాట్లాడాను, నన్ను క్షమించు` అని వెల్లడించారు చిన్నికృష్ణ. చిరంజీవితో దేశం గర్వించే కథను రాస్తానని వెల్లడించారు. మరి అది ఎప్పుడు సాధ్యమనేది చూడాలి.
55
బాబీ సినిమాతో చిరంజీవి బిజీ
చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంకోవైపు `విశ్వంభర` మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఆగిపోయింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. మరోవైపు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మెగాస్టార్.