విడిపోతున్న స్టార్‌ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి?.. సోషల్‌ మీడియాలో దుమారం..

Published : Jun 25, 2022, 05:38 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. తాజాగా సెలబ్రిటీ జంట విడిపోతున్నట్టు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో కలకలం రేపుతున్నాయి.   

PREV
16
విడిపోతున్న స్టార్‌ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి?.. సోషల్‌ మీడియాలో దుమారం..

టాలీవుడ్‌లో స్టార్‌ సింగర్స్ గా రాణిస్తున్నారు సింగర్‌ హేమచంద్ర, శ్రావణ భార్గవి. పాటల కార్యక్రమాల్లో పాల్గొంటూ సింగర్స్ గా ఎదిగిన వీరిద్దరికి `సరిగమప` మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో హేమచంద్ర రన్నరప్‌గా నిలవడం విశేషం. అక్కడ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. 

26

హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగర్స్ గా ఎదుగుతున్న క్రమంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే రంగంలో ఉండటంతో మరింత దగ్గరయ్యారు. దీంతో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2012డిసెంబర్‌ 9న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా, 2013 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. 
 

36

ఈ సింగర్స్ జంట చాలా కాలంగా మంచి అనోన్య జంటగా పేరుతెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి అనేక షోస్‌లోనూ పాల్గొంటూ వేదికలపై సందడి చేస్తుంటారు. పాటల కార్యక్రమాలతోపాటు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్స్ షోస్‌లోనూ పాల్గొంటూ అలరిస్తున్నారు. ఆడియెన్స్‌ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో యంగర్‌జనరేషన్‌లో టాప్‌ సింగర్స్ గా రాణిస్తున్నారీ జంట. 

46

ఇదిలా ఉంటే తాజాగా వీరికి సంబంధించి ఓ షాకింగ్‌ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ స్టార్‌ సింగర్స్ విడిపోతున్నట్టు ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడిపోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 

56

గత మూడు నాలుగు రోజులుగా ఈ ఇద్దరు విడిపోతున్నట్టు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మ్యారేజ్‌కి బ్రేకప్‌ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఇద్దరికి పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో డైవర్స్ తీసుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం. అయితే హేమచంద్ర, భార్గవి సన్నిహితుల నుంచి మాత్రం అది నిజం కాదని తెలుస్తుంది. మరి ఏది నిజమనేది సస్పెన్స్ గా మారింది. నిప్పు లేనిదో పొగరాదనే సామేతని గుర్తు చేస్తున్నారు. 

66

ఇటీవల నాగచైతన్య, సమంత విషయంలో ఇలాంటి రూమర్సే వచ్చాయి. చివరికి వాళ్లు వినిపోయారు. అలాగే ధనుష్‌, ఐశ్వర్య ధనుష్‌ సైతం విడిపోతున్నట్టు చెప్పి షాకిచ్చారు. మరోవైపు బాలీవుడ్‌ అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావులు విడిగా ఉండాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హేమచంద్ర, శ్రావణ భార్గవిల విషయంలో రూమర్స్ లోనూ నిజమే ఉందంటున్నారు. మరి ఏది నిజమనేది తేలాలంటే వాళ్లు స్పందించాల్సిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories