స్టార్ సింగర్ చిన్మయి సంచలనం, డబ్బులు ఇస్తే అలాంటి వీడియోలు చేసి పంపుతా అంటూ ఓపెన్ ఆఫర్!

First Published May 25, 2021, 10:00 AM IST

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కరుడుగట్టిన ఫెమినిస్ట్. పరిశ్రమలో ఆడవాళ్ళపై జరుగుతున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల గురించి ఆమె పెద్ద ఉద్యమమే నడిపారు. సౌత్ ఇండియాలో మీటూ ఉద్యమానికి భారీ ప్రచారం కల్పించారు సింగర్ చిన్మయి. 
 

ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చిన్మయి కంప్లైంట్ చేశారు. పరిశ్రమలో పలుకుబడి ఉన్న పెద్దలపై ఆరోపణలు చేసిన చిన్మయి కెరీర్ కూడా కోల్పోవడం జరిగింది.
undefined
ఏది ఏమైనా యాక్టివిస్ట్ గా చిన్మయి సోషల్ మీడియా ద్వారా తన పోరాటం కొనసాగిస్తున్నారు. చిన్మయి సోషల్ మీడియా పోస్ట్స్ కొంచెం ఘాటుగా ఉంటాయి. వ్యక్తులు ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే ఆమె నేరుగా ప్రశ్నిస్తారు.
undefined
అయితే చిన్మయి వ్యవహారం ఓ వర్గానికి నచ్చదు. ఆమె వ్యాఖ్యలు, ప్రవర్తనను తప్పుబట్టేవారు లేకపోలేదు. చిన్మయి అంటే నచ్చని వారు ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ చిన్న అవకాశం దొరికినా ఆమెపై విమర్శల దాడి చేస్తూ ఉంటారు.
undefined
కాగా చిన్మయి తాజా సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె డబ్బులు ఇస్తే వీడియోలు చేసి పంపుతా ఉంటూ అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. తనకు ఆర్థిక వనరులు అవసరం అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.
undefined
చిన్మయి ఫెమినిస్ట్ మాత్రమే కాకుండా సోషలిస్ట్ కూడా. ఆమె ముగ్గురు స్టూడెంట్స్ ని  చదివించే బాధ్యత తీసుకున్నారట.  ఆ ముగ్గురిలో ఒకరు మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. వాళ్ళ ఫీజులు చెల్లించడం కోసం చిన్మయికి డబ్బులు కావాలట.
undefined
దీని కోసం ఆమె ఫ్యాన్స్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా తమకు ఇష్టం వచ్చిన సాంగ్ చెబితే దానిని పాడుతూ వీడియో రికార్డు చేసి పంపుతా, అలాగే బర్త్ డే విషెస్ కూడా తెలియజేస్తాను. దానికి కొంత డబ్బులు ఇవ్వండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
undefined
చిన్మయి డై హార్డ్ ఫ్యాన్స్ కి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. చిన్మయి స్వయంగా పాట పాడుతూ చేసిన వీడియో కావాలంటే మీరు కొంచెం డబ్బులు ఖర్చు చేస్తే చాలన్న మాట. మరి చిన్మయి ఆఫర్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
undefined
సింగర్ చిన్మయి ఇంస్టాగ్రామ్ ఫొటోస్
undefined
సింగర్ చిన్మయి ఇంస్టాగ్రామ్ ఫొటోస్
undefined
click me!