నయనతార అన్న ఎవరో మీకు తెలుసా..? నయన్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..?

First Published | Feb 18, 2024, 2:17 PM IST

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటి నయనతార. ఆమె, ఆమె భర్త విఘ్నేష్ గురించి తెలుసు.. కాని ఆమె సొంత ఫ్యామిలీ గురించి తల్లి తండ్రులు.. సోదరుడి గురించి మీకు తెలుసా..? నయన్ అన్నని ఎప్పుడైనా చూశారా..? 
 

సౌత్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది నయనతార.  లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార తమిళంతో పాటు.. తెలుగు,మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూ.. వస్తోంది. అన్ని భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించింది సీనియర్ బ్యూటీ. జవాన్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసింది నయనతార. 

అంతే కాదు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో నయనతార కూడా ఒకరు. నయనతార మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, ఇలా తెలుగు,తమిళ సినీ ప్రముఖులతో నటించి మెప్పించింది. అంతే కాదు విమెన్ సెంట్రిక్ సినిమాలతో కూడా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి నయనతార. 


రెండు సార్లు ప్రేమలో విఫలం అయిన ఈ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి ప్రేమలో విజయం సాధించింది. దాదాపు 5 ఏళ్ళు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు వయా మరియు ఉలాగ్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత నయనతార వరుసగా  తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన భర్త మరియు పిల్లలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. 

నయనతార చివరిగా అన్నపురాణిలో కనిపించింది. తన 75వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించలేదు.ఇక ఆమె ఇటు సినిమా జీవితంతో పాటు.. పలు బిజినెస్ లు చేస్తూ.. చేతినిండా సంపాదిస్తోంది. హీరోయిన్లలో అది కూడా సౌత్ తారల్లో ప్రైవేట్ జెట్ ఉన్న  హీరోయిన్ నయనతార ఒక్కతే.  

నయనతార చెన్నైలో సెటిల్ అయినా.. ఆమె కేరళకు చెందిన తార అని తెలిసిందే. నయనతార అసలు పేరు డయానా. ఆమె తండ్రి పేరు కురియన్ కొడియాతు, తల్లి పేరు ఒమన్ కురియన్, సోదరుడి పేరు లెనో. నయనతార తల్లి ..తండ్రి  గురించి చాలా మందికి తెలుసు.. వారి ఫోటోలు కూడా గూగుల్ లో దొరుకుతాయి. కాని నయన్ సోదరుడి గురించి మీకు తెలుసా..? ఆయన ఎవరు.. ఏం చేస్తాడు.. ఎక్కడ ఉంటాడో తెలుసా..? 

నయనతార అన్న పేరు లేనో. ఆయన విదేశాల్లో ఉంటారు. తాజాగా నయన్ సోదరుడి ఫోటో ఒకటి విడుదలైంది. నయన్, విఘ్నేష్ శివన్, లెనో కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. నయన్ మరియు విఘ్నేష్ శివ ఇద్దరి భుజాలపై చేతులు వేసి.. కౌగిలించుకుని లెనో పోజులిచ్చాడు. 

Nayanthara

అయితే ఆయన ప్రస్తుతం  దుబాయ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అక్కడ బిజినెస్ చేస్తున్నాడట లెనో. అంతే కాదు అన్న ద్వారా దుబయ్ లో నయనతార కూడా బిజినెస్ చేస్తుందట. ఇక్కడ డబ్బుని అక్కడ భారీగా ఆమె ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!