SSMB29: మహేష్‌ ఫ్యాన్స్ నిరాశ చెందే వార్త వైరల్‌.. అసలు నిజం ఏంటి? రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అంటే?

Published : Feb 18, 2024, 01:46 PM IST

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాపైనే అందరి చూపు ఉంది. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఓ వార్త ఇప్పుడు ఫ్యాన్స్ ని నిరాశకి గురి చేస్తుంది.   

PREV
16
SSMB29: మహేష్‌ ఫ్యాన్స్ నిరాశ చెందే వార్త వైరల్‌.. అసలు నిజం ఏంటి?  రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అంటే?

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా దాదాపు 12ఏళ్లుగా ప్లాన్‌ జరుగుతుంది. ఇన్నాళ్లకి వర్కౌట్‌ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మహేష్‌ ఫ్యాన్స్ నిరాశ చెందే వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఆ వార్తేంటి? ఎందుకు వైరల్‌ అవుతుందనేది చూస్తే..  

26
Mahesh,rajamouli

`ఎస్‌ఎస్‌ఎంబీ29` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందనే వార్త వైరల్‌ అవుతుంది.ఈ విషయాన్ని కెమెరామెన్‌ ఎస్‌ గోపాల్‌ రెడ్డి చెప్పడం విశేషం. వచ్చే ఏడాది మేలో ఈ మూవీ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. స్క్రిప్ట్ చివరి దశకు చేరుకుందని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మహేష్‌ ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం అంటే సినిమా పూర్తవడానికి మరో ఐదేళ్లు పడుతుంది. ఇక మా పిల్లలతో సినిమా చూడాలేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. 

36

ఈ వీడియో క్లిప్‌, ఆయన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నాయి. అయితే ఇందులో నిజమేంటి అనేది చూస్తే.. ఎస్‌ గోపాల్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని వందల సినిమాలకు పనిచేశారు. స్టార్‌ హీరోలందరితోనూ పనిచేశారు. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారు. ఆయన మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాలో భాగమయ్యారు. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ ఈ సినిమా ప్రొడక్షన్‌లో భాగమవుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బాధ్యతలు తీసుకున్నారు ఎస్‌ గోపాల్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ టీవీ(టీవీ9) ఛానెల్‌తో ముచ్చటించారు.
 

46
SS Rajamouli

ఇందులో కెమెరామెన్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళిని అప్పుడే నమ్మినట్టు చెప్పారు. అప్పుడే పెద్ద దర్శకుడు అవుతాడని భావించామని, దీంతో సినిమా చేయాలని అనుకున్నామని తెలిపారు. అందులోనూ మహేష్‌, రాజమౌళి కాంబినేషన్ అయితే బాగుండు అని అనుకున్నారట. అది ఇప్పుడు వర్కౌట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని యాంకర్‌ అడగ్గా వచ్చే ఏడాది మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలిపారు. తాజాగా యూట్యూబ్‌లో ఈ ఇంటర్వ్యూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

56

అయితే ఇందులో నిజం ఏంటనేది చూస్తే.. ఈ ఇంటర్వ్యూలో యాంకర్‌ గతేడాది చివర్లో చేశారు. కానీ దాన్ని అప్‌లోడ్‌  ఇప్పుడు చేశారు. ఈ టెక్నీకల్‌ రీజన్‌తో ఈ కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. లాస్ట్ ఇయర్‌లో ఆయన మాట్లాడాడు కాబట్టి `వచ్చే ఏడాది మేలో ప్రారంభమవుతుంది` అని చెప్పారు. కానీ ఆ ఛానెల్‌ వాళ్లు ఈ ఏడాది పోస్ట్ చేయడంతో ఈ టెక్నికల్‌ సమస్య వచ్చింది. ఇందులో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే వార్త లేదని చెప్పొచ్చు. ఈ సమ్మర్‌లోనే ఈ మూవీ ప్రారంభం కానుందని చెప్పొచ్చు. ఇప్పటికే మహేష్‌ బాబు కూడా ఈ మూవీకి వర్కౌట్‌ స్టార్ట్ చేశాడు. కచ్చితంగా త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది. 
 

66

ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ స్టార్ట్ చేశారు రాజమౌళి. స్క్రిప్ట్ ఫైనలైజ్‌ చేయడంతోపాటు టెక్నీషియన్లని ఫైనల్‌ చేస్తున్నారు. తన పాత టీమ్‌ అందరిని మార్చేశారు. కొత్త టీమ్‌ని రంగంలోకి దించుతున్నారు. కెమెరామెన్‌, ఎడిటర్‌, వీఎఫ్‌ఎక్స్ టీమ్‌లను మార్చేశాడు. మరోవైపు విదేశీ హీరోయిన్‌ని తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇండోనేషియా హీరోయిన్‌తో చర్చలు జరిపారట. ఈ మూవీని ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా రూపొందిస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు కెఎల్‌ నారాయణ, ఎస్‌ గోపాల్‌ రెడ్డి(దుర్గా ఆర్ట్స్). దీన్ని రెండు పార్ట్ లుగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇందులో మహేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories