'దేవర' చిత్రానికి అసలైన పండగ.. ఎన్టీఆర్ మూవీ కోసం ఇద్దరు బడా నిర్మాతల మధ్య తీవ్ర పోటీ ?

First Published Apr 17, 2024, 9:52 AM IST

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ రెండవసారి నటిస్తున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ రెండవసారి నటిస్తున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దేవర చిత్రాన్ని కొరటాల తిరుగులేని పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తున్నారు. 

దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ డ్రామా ఇది. ఆల్రెడీ విడుదలైన టీజర్ తో అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరిపోయాయి. కొరటాల శివ పట్టు వదలకుండా ఎన్టీఆర్ అభిమానులు ఉక్కిరి బిక్కిరయ్యే స్టఫ్ ని సిద్ధం చేస్తున్నారు. 

ఆల్రెడీ నార్త్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు బడా నిర్మాత కరణ్ జోహార్ తో దేవర తీజ్ టై అప్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ ఉంటుందనేది ఖాయం. దేవర చిత్రానికి ఉన్న క్రేజ్ ని నిర్మాతలు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. థియేట్రికల్ రైట్స్ విషయంలో దేవర మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

ఈ క్రమంలో నైజాం ఏరియా గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. దేవర చిత్రాన్ని నైజాం ఏరియాలో కొనుక్కునేందుకు ఆల్రెడీ దిల్ రాజు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ దిల్ రాజుకి పోటీగా మరో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కూడా రంగంలోకి దిగిందట. 

ఒకవైపు దిల్ రాజు, మరో వైపు మైత్రి వాళ్ళు పోటీ పడి మరీ దేవర చిత్ర హక్కుల కోసం ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేస్తున్నారట. దేవర చిత్రం క్రేజ్ పెరిగే కొద్దీ ఆ ధర మరింత ఎక్కువ కావచ్చు. అందుకే దేవర మేకర్స్ తొందర పడడం లేదు. 

దేవర చిత్రం కోసం నిర్మాతలు ఈ స్థాయిలో పోటీ పడుతుండడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఒకప్పుడు నైజాం ఏరియా అంటే బడా చిత్రాలన్నీ ఆల్మోస్ట్ దిల్ రాజు చేతుల్లోకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు దిల్ రాజుకి పోటీగా మైత్రి మూవీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని ప్రారంభించారు. 

click me!