కురచ టాప్, టైట్ జీన్స్.. మరోమారు తన గ్లామర్ పవర్ చూపించిన స్టార్ కిడ్ శివాత్మిక!

First Published Jul 5, 2021, 12:49 PM IST

స్టార్ కిడ్ శివాత్మిక అడుగులు పరిశ్రమలో వేగంగానే సాగుతున్నాయి. ఆమె వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ హీరోయిన్ గా స్థిరపడే ప్రయత్నంలో ఉన్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో అవకాశాలు రాబడుతూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది అమ్మడు. 
 

2019లో విడుదలైన దొరసాని చిత్రంతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న దొరసాని కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయితే శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
undefined
దీనితో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఆమెకు దక్కుతున్నాయి. దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలోని ఓ పాత్ర కోసం శివాత్మికను ఏరి కోరి ఎంపిక చేశారు. ఈ మూవీలో ప్రధాన పాత్ర చేస్తున్న ప్రకాష్ రాజ్ కూతురుగా ఆమె కనిపించనున్నట్లు సమాచారం.
undefined
రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్ర చాల భిన్నంగా ఉంటుందని సమాచారం. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ వంటి నటులు రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు.
undefined
తెలుగులో లీడ్ హీరోయిన్ గా శివాత్మిక అవకాశాలు దక్కించుకోలేకపోవడం విచారించదగ్గ విషయం. అయితే ఆమెకు తమిళ పరిశ్రమలో అవకాశాలు దక్కుతున్నాయి.
undefined
తమిళంలో రెండు చిత్రాలలో ఆమె హీరోయిన్ గా చేస్తున్నారు. యువ హీరో కార్తీక్ గౌతమ్ కి జంటగా ఆనంద విలయాడుమ్ వీడు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
undefined
తాజాగా హీరో అశోక్ సెల్వన్ ఐదవ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో శివాత్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఆర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శివాత్మికతో పాటు అపర్ణ బాలమురళి, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
undefined
గతంలో కూడా తెలుగు అమ్మాయిలు శ్రీదివ్య, అంజలి తెలుగు కంటే తమిళ పరిశ్రమలో హీరోయిన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శివాత్మిక కూడా అటువైపుగా అడుగులు వేస్తున్నారు.
undefined
ఇక శివాత్మిక గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఆమె తరచుగా క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ, తనలోకి గ్లామర్ పవర్ చూపిస్తుంది. హీరోయిన్ గా ఎదగాలంటే ఇలాంటి ఫోటో షూట్స్ తప్పనిసరి మరి.
undefined
click me!