రహస్య వివాహం చేసుకున్న జబర్దస్త్ వినోద్... పెళ్లి తరువాత భార్య షాకింగ్ రియాక్షన్...

First Published Jul 5, 2021, 11:21 AM IST


జబర్దస్త్ వేదికపై లేడీ గెటప్స్ కి వినోద్ చాలా ఫేమస్. వందకు పైగా స్కిట్స్ లో వినోద్ లేడీ గెటప్ లో కనిపించారు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర భార్యగా ఆయన కామెడీతో ప్రేక్షకులకు వినోదం పంచడం జరిగింది. 

జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వారిపై సొసైటీలో అనేక అపోహలు ఉన్నాయి. వీరు అమ్మాయిలా, అబ్బాయిలా లేక ట్రాన్స్ జెండర్సా అనే చర్చ సాగుతుంది. జబర్దస్త్ లో లేడీ వేషాలు వేసిన ప్రియాంక లాంటి వారు జెండర్ మార్చుకొని పూర్తి స్థాయి అమ్మాయిగా మారారు.
undefined
ఈ తరుణంలో వినోద్ పెళ్లి చేసుకున్నాడన్న వార్త అందరినీ షాక్ కి గురిచేసింది. జబర్దస్త్ వినోద్ జెండర్ పై కూడా అనేక అనుమానాలు ఉండగా, వినోద్ పెళ్లి చేసుకొని ఓ క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను పెళ్లి చేసుకున్న విషయం తెలియజేస్తూ, భార్యను కూడా పరిచయం చేశాడు.
undefined
వినోద్ కొత్తగా వినోద్ తో వినోదం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఈ ఛానల్లో మొదటి వీడియో పోస్ట్ చేసిన వినోద్, తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. తనకు లాక్ డౌన్ లో పెళ్లికి జరిగిందన్న విషయం బయటపెట్టారు.
undefined
కడప ప్రాంతానికి చెందిన వినోద్ తన అక్క కూతురు అయిన విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి చిన్ననాటి నుండి పరిచయం ఉందని, వినోద్ తెలియజేశారు. ఆ వీడియో ఆమె చేత కూడా మాట్లాడించారు.
undefined
ఓ సెలెబ్రిటీ అయిన నన్ను వివాహం చేసుకోవడం నీకు ఎలా ఉంది, తనతో మ్యారీడ్ లైఫ్, హైదరాబాద్ ఎలా ఉందని వినోద్ అడిగాడు. దానికి విజయలక్ష్మి సమాధానం చెప్పారు. a
undefined
వినోద్ ని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్న విజయలక్ష్మి, ఇల్లు, హైదరాబాద్ చాల నచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక విజయలక్ష్మి కెమెరా ముందు మాట్లాడానికి సిగ్గుపడుతుంది, మాములుగా అయితే మాటలు దులిపేస్తుందని, వినోద్ తెలిపారు.
undefined
ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. మేము కూడా అందరిలా సాధారణ పురుషులమే, లేడీ గెటప్స్ వేసే మరొక కమెడియన్ హరికృష్ణ కూడా పెళ్లి చేసుకున్నారని, మిగతా వారు కూడా చేసుకుంటారని వినోద్ వీడియోలో తెలియజేశారు.
undefined
ఇక తనకు ఏంతో సప్పోర్ట్ ఇచ్చి ఈ స్థాయికి తెచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన వినోద్, తన యూట్యూబ్ ఛానల్ ని ఆదరించాలని, ఈ ఛానల్ ద్వారా మరింత ఫన్ అందించనున్నట్లు తెలియజేశారు.
undefined
భార్యతో జబర్దస్ వినోద్
undefined
భార్యతో జబర్దస్ వినోద్
undefined
click me!