చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయితే శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి.